రేపటి నుంచి మృత్యు పంచకం ఆరంభం: అత్యంత అశుభ దినాలు
జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణించే మృత్యు పంచకం గడువు సమీపించింది. ఇంకో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 6న సాయంత్రం 7:03 నిమిషాలకు ప్రారంభమై 11 ఉదయం 8:16 నిమిషాలకు ముగుస్తుంది. ఈ అయిదు రోజుల కాలాన్ని అత్యంత సున్నితమైనదిగా పరిగణిస్తారు. ఈ వ్యవధిలో కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని వస్తువులను కూడా కొనడం కూడా వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రుడు కుంభ, మీన రాశులలోని అయిదు ప్రత్యేక నక్షత్రాలయిన ధనిష్ఠ, శతభిష, పూర్వాభాద్రపద, ఉత్తరాభాద్రపద, రేవతి మీదుగా సంచరించే అయిదు రోజుల కాలాన్ని 'పంచకం' అంటారు. వాటిలో మృత్యు పంచకం అత్యంత తీవ్రమైనది. ఈ సమయంలో ప్రమాదాలు, వివాదాలు, అనూహ్య సంఘటనలు సంభవించే అవకాశం ఉందని నమ్ముతారు. ఈ సమయంలో చేసే కొన్ని పనుల వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయని సూచిస్తారు.

గరుడ పురాణం ప్రకారం ఈ మృత్యు పంచక కాలంలో ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబ సభ్యులకు సంకటం వచ్చే అవకాశం ఉంది. అందుకే అంత్యక్రియలకు ముందు ప్రత్యేక ధార్మిక అనుష్ఠానాలు నిర్వహించాలని గరుడ పురాణం సూచిస్తోంది. ఇది ప్రధానంగా ఒక ధార్మిక విశ్వాసం మాత్రమే. దీన్ని ఆస్తిక దృష్టితో చూడాలి.
శాస్త్రాల ప్రకారం మృత్యు పంచకం సమయంలో ఎవరైనా మరణిస్తే, అంత్యక్రియలకు ముందు దర్భ గడ్డి లేదా పిండితో ఐదు ప్రతీకాత్మక బొమ్మలను తయారుచేస్తారు. ఈ బొమ్మలను మృతదేహంతో పాటు ధార్మిక పద్ధతిలో దహనం చేస్తారు. దీనివల్ల దోషాలు తొలగిపోతాయని, కుటుంబానికి రాబోయే అరిష్టాలు నివారించినట్టవుతుందనేది విశ్వాసం.
మృత్యు పంచకంలో కొన్ని పనుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. వాహనాలు నడుపుతున్నప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వివాదాలు, గొడవలకు దూరంగా ఉండాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. రిస్క్ తో కూడుకున్న, ప్రమాదకరమైన పనులను వాయిదా వేయడం మంచిదని పెద్దలు చెబుతారు.
ఈ కాలంలో ఇనుము లేదా భవన నిర్మాణ సామగ్రిని ఎక్కువగా కొనుగోలు చేయడాన్ని వాయిదా వేసుకోవాలి. శుభకార్యాలు, మంగళకరమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమమని విశ్వాసాలు చెబుతున్నాయి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చని నమ్మకం.
సాయంత్రం పూట హనుమాన్ చాలీసా లేదా సంకట్ మోచన్ హనుమాన్ అష్టకం పఠించండి. ఇది నకారాత్మక శక్తుల నుండి రక్షిస్తుంది. దానధర్మాలు చేయడం మంచిది. ముఖ్యంగా శనివారం నాడు నల్ల నువ్వులు, ఆవాల నూనె లేదా నల్లటి బట్టలు దానం చేయండి. ఇది దుష్ఫలితాలను తగ్గిస్తుంది. దక్షిణ దిశకు సంబంధించిన ఏ ముఖ్యమైన పనులైనా వాయిదా వేయండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద హనుమాన్ చిత్రం లేదా స్వస్తిక్ గుర్తును ఉంచండి. ఇది రక్షణ కవచంగా పనిచేస్తుంది.
మృత్యు పంచక్ మనకు జాగ్రత్త, ఓర్పులను నేర్పుతుంది. ఈ సమయంలో ఎలాంటి కొత్త శుభకార్యాలు ప్రారంభించకుండా, పాత పనులను పూర్తి చేయడంపై, ఆత్మ పరిశీలనపై దృష్టి సారించండి. అప్రమత్తంగా ఉండటం ద్వారా పెద్ద కష్టాల నుండి తప్పించుకోవచ్చు.












Click it and Unblock the Notifications