• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యుగ(కాల) స్వభావాలు: ధర్మం నాలుగు పాదాల నుంచి..?

|

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"

ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్: కృతము అనగా చేయబడినది. దీనికే సత్యయుగము అని కూడా పేరున్నది. అంటే ఇక్కడ మనం ధర్మ పరిరక్షణ కొరకై పాటుపడాలి, ధర్మము చేయాలి అని ఎవరూ మనకు చెప్ప నక్కరలేదు,విధిగా మనమే చేయాలి అనుకొని ధర్మం చేస్తారు అంతే. అక్కడ ధర్మం చేయడం స్వభావం. సహజంగా ధర్మం చేయబడే యుగం పేరు కృతయుగం. ఇక్కడ నాలుగు పాదముల ధర్మం ఉంటుంది.

త్రేతాయుగం - మూడు పాదములు ధర్మం ఉంటుంది. ఒక్క పాదం ధర్మం ఉండదు.

ద్వాపరయుగం - రెండు పాదములు ధర్మం, రెండు పాదములు అధర్మం.

కలి - కల్యంతే కలహన్ కుర్వన్త్యస్మిన్ ఇతి కలిః - ఒకరి కొకరు పడని కాలం పేరే కలియుగం.

పూర్వ యుగాలలో కలిసి ఉండడానికి కారణాలు వెదికే వారు. కలియుగంలో విడిపోవడానికి కారణాలు వెతుకుతూ ఉంటారు.తరించడానికి అవకాశం ఉన్న గొప్పం యుగం

ఈ నాలుగు యుగాలూ మనలోనే ఎప్పుడైనా సాధించవచ్చు అనే విషయం మహాభారతంలో హనుమంతుడు భీముడికి చెప్తాడు.

the story about four yugas effects

ధర్మాచరణ చేసేటప్పుడు కృతము, ధర్మం తగ్గుతూ తగ్గుతూ వస్తూ ఉంటే మిగిలిన మూడు యుగాలు మనలోనే వస్తూ ఉంటాయి. అందుకే బయట ఏది ఉన్నప్పటికీ కూడా మనలో మనం ధర్మాచరణ చేయాలి అనుకుంటే కలియుగంలో కూడా మనకి కృతయుగం సాధ్యమే. ఇది ఎలా అంటే ఊరు నిండా ముళ్ళ కంపలు, గాజుపెంకులు పరచుకొని ఉంటే మనం ఊరంతా తివాచీ పరచనక్కర లేదు. మన కాలికి చెప్పులు వేసుకొని వెళ్తే చాలు.

సమూహమునందు అధర్మం ఉన్నా వ్యక్తి ధర్మమునందుంటే అతడు కాపాడబడతాడు.

రామాయణ కాలంలో లంకలో ఇది కనబడుతుంది మనకు రావణుడు చేసిన అకృత్యాలకు

అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః - అప్రియమైనది హితమైనది చెప్పేవాడు ఉండడు. వినేవాడు ఉండడు.మారీచుడు రావణునితో

హనుమంతుడు లంకను తగులబెట్టినప్పుడు లంక అంతా దగ్ధం అయింది కానీ విభీషణుని ఇల్లు దగ్ధం కాలేదు. ధర్మమునందు నిలిచి ఉన్నాడు గనుక అగ్ని దహించలేదు విభీషణుని ఇంటిని. చుట్టూ అధర్మం ఉన్నా మనం ధర్మమునందు ఉంటే ప్రకృతి వైపరీత్యాల నుండి కానీ మరి దేని నుండి అయినా మనల్ని మనం కాపాడుకోగలం.ధర్మముతో కలియుగంలో కూడా కృతయుగం సాధన చేసుకోవచ్చు.

త్రేతాయుగంలో మంచి,చెడు(స్వార్ధం) అనేది సముద్రానికి అవతలి వారితో ఇవతలి వారికి ఉండేది.అంటే శ్రీరామునికి,రావణాసురునికి మధ్య.

అదే ద్వాపర యుగ కాలానికి వచ్చే సరికి రెండు కుటుంబాల మధ్య ఏర్పడింది. అంటే పాండవులు ,కౌరవుల మధ్య.

ఇక కలియుగ కాలం వచ్చే సరికి మనషి శరీరంలోనే మంచి చెడు ఇమిడి పోయాయి. కాబట్టి దైవత్వం ,రాక్షసత్వం కలగలిపిన స్వభావంతో మెదలడం మనం గమనిస్తున్నాం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Astrologer told the story about four yugas effects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more