• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జపానికి 108 సంఖ్యే ఎందుకు? దాని ప్రాముఖ్యత ఏమిటి?

|

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"

ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్:మనం ఏదైనా మంత్రం జపించడానికి 108 సంఖ్యను ఉపయోగిస్తుంటాము.ఇది మనం పెద్దలు చెప్పారని ఆచరిస్తున్నాము.అసలు ఈ 108 సంఖ్యకు అంత ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నాం కాని ఎప్పుడైన ఆలోచించారా,ఆ విషయం గురించి ఎవరి ద్వార నైన తెలుసుకోవాలని ప్రయత్నం కూడ చేయలేదు అందుకే ఆ సంఖ్య యొక్క ప్రాదాన్యతను మీకు వివరిస్తున్నాం.

The story about significance of 108 number

విష్ణుసహస్రనామాలు 108,అష్తోత్తరాలలో 108 సంఖ్య నామాలతో దేవతలను ఆరాధిస్తాము. ఇందుకు ప్రదానమైన కారణం మన భారతదేశ ఋషిపుంగవుల అనేక వేల సంవత్సరాల వారి పరిశోధనలో తెల్చిచెప్పిన జ్యోతిషానికి సంబంధించి మనకు ఉపయోగ పడేవి 27 నక్షత్రాలు ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అనగా నక్షత్రాలు వాటి పాదాలు కలిపితే 27 x 4 = 108 అవుతుంది. ప్రతి మనిషి ఈ 108 నక్షత్ర పాదాలలో ఏదో ఒకదానిలో పుట్టి ఉంటాడు కావున ఈ సంఖ్యకు అంత ప్రాముఖ్యత.కానీ వీటికన్నా మరెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ సంఖ్యతో ముడిపడి ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాము.

The story about significance of 108 number

ఖగోళ పరంగాసూర్యునికి, భూమికి ఉన్న దూరం 149.6million kms. ఈ దూరాన్ని సూర్యుని చుట్టు కొలత 1391000kms తో భాగిస్తే వచ్చే సంఖ్యా రమారమి 108

అలాగే చంద్రునికి భూమికి ఉన్న దూరం 38 లక్షల కిలోమీటర్లను చంద్రుని చుట్టుకొలత అయిన 3474 kms తో భాగిస్తే వచ్చే సంఖ్య 108

27 నక్షత్రాలు ప్రతి నక్షత్రానికి 4 పాదాలు = 27 x 4 = 108

12 రాశులు 9 నక్షత్ర పాదాలు = 12 x 9 = 108

హైందవం ప్రకారంముఖ్య శివలింగాలు 108 అందుకే శైవ మతాలు కూడా 108.గౌడియ వైష్ణవంలో బృందావనలో 108 గోపికలను పూజిస్తారు. 108 వైష్ణవ దివ్య క్షేత్రాలుకంబోడియాలో ఆంగ్కోర్ వాట్ గుడిలో 108 మంది (అసురులు, దేవతలు) కలిసి సాగరమధనం చేసినట్టు చిత్రింపబడివుంది.హైందవ భావాలనుండి ప్రేరణ పొందిన బౌద్ధం ప్రకారం పంచేంద్రియాలతో స్పృహ ను కలిపి ఆరు భావాలను వాటివల్ల కలిగే అంతర్భావాలైన సుఖము, దుఃఖము, స్తిరత్వబుద్ధిని గుణించి అవి బాహ్యంగానైనా ఆంతరంగానైనా భూత, భవిష్యద్, వర్తమానాలలో కలిగిన భావనలను గుణిస్తే 6x3x2x3 = 108

ఓం పూర్ణమదః పూర్ణమిదం

పుర్ణాత్పూర్ణముదచ్యతే

పూర్ణస్య పూర్ణమాదాయ

పూర్ణమేవావశిష్యతే

The story about significance of 108 number

నుండి ఇన్ఫినిటీ (8) కు చేరుకునే విధానం 108 symbolism.

ఆయుర్వేదం ప్రకారం 108 మర్మ స్థానాలు, శక్తి కేంద్రాలు

కలారిపయట్టు ప్రకారం ( తరువాత కరాటే గా మారింది) 108 pressure పాయింట్స్

108 డిగ్రీల జ్వరం వచ్చినప్పుడు శరీరంలో ఉన్న అన్ని అవయవాలు చచ్చుబడిపోతాయి.

108 సార్లు జపం చేయడం వలన మనస్సును నిర్మలం చేస్తుంది.

లోపల ఉన్న భావాలను అణగదోక్కుతుంది.

సంస్కృత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. వాటికి శివ, శక్తి తత్త్వాలైన స్త్రీ, పురుష రూపాలుంటాయి. 54 x 2 =108

12000 దివ్య సంవత్సరాలు = 43,20,000 మానవ సంవత్సరాలు = బ్రహ్మకు ఒక పగలు = 4000 x 108108 లో 1 జీవుడిని తెలియచేస్తుంది. 8 జీవుని తత్త్వాలను తెలియ చేస్తుంది. 0 పరిపూర్ణ భగవత్తత్త్వము. ఈ శరీరాన్ని జీవుడిని కలిపి నియమించేది పరిపూర్ణ భగవత్తత్త్వము 108.

ఈ సంఖ్యను కూడితే 1+0+8 = 9 చాలా ముఖ్యమైన సంఖ్య. 9 తో ఏది కలిపినా వచ్చిన సంఖ్యలో numberలను కలిపితే చివరకు అదే సంఖ్య వస్తుంది.

గణిత పరంగా 108 ఒక abundant number. అంటే వాటి divisors 1+2+3+4+6+12+18+27+36+54 = 163 > 108

Tetranacci number ( ముందటి నాలుగు fibonacci నమ్బెర్లను కలిపితే వచ్చేది) 0,0,1,1,2,4,8,15,29,56,108

హైపర్factorial 1*1 + 2*2 + 3 **3 = 108

ఒక పెంటగాన్ కోణాలు అన్నీ కలిపితే 108

ఒక refactorable number ( వాటి divisors ఎన్నున్నాయో వాటితో భాగింపపడగలిగేది )

ఇంకా మరెన్నో విశిష్టతలను తనలో ఇముడ్చుకున్న సంఖ్యా

ఇటువంటి ప్రత్యేకతతో ఉన్నది కనుకనే మన ఋషులు, ద్రష్టలు ఎప్పుడో 108 సంఖ్య ప్రాముఖ్యతను మనకు నామాలలో, ప్రదక్షిణలలో, జపాలలో విధిగా విధించారు. మన పూర్వీకులైన వారు చాలా విషయాలను మనకోసం శోధన,సాధన వలన మనకు తెలియకుండానే లాభం పొందుతున్నాము.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Astrologer told about significance of 108 number in japa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more