వీరికి త్వరలో జాక్ పాట్ ఖరారు చేసిన భద్ర మహాపురుష రాజయోగం!
జ్యోతిష్య శాస్త్రం చాలా ప్రత్యేకమైనది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఇలా గ్రహాలు రాశి మారినప్పుడల్లా ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. 25 సెప్టెంబర్ మాసంలో బుధుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు కన్యారాశిలో కి ప్రవేశించడం వల్ల భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది.
భద్ర మహాపురుష రాజయోగం
జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని తెలివితేటలకు, కమ్యూనికేషన్ కు, వ్యాపారానికి ప్రతినిధిగా చెబుతారు. అటువంటి బుధుడు తన సొంత రాశి అయిన కన్య రాశిలో ప్రవేశించడం కారణంగా భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా మిధున రాశి, సింహ రాశి, ధనుస్సు రాశి జాతకులు విశేష ఫలితాలను పొందబోతున్నారు. మరి అవేమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
భద్ర మహాపురుష రాజయోగం కారణంగా మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. మిధున రాశి వారు ఈ సమయంలో అనేక శుభ ఫలితాలను చూస్తారు. నూతన వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి పరంగా కూడా లాభాలు వస్తాయి. ఇది మిధున రాశి వారికి అదృష్ట కాలం.
సింహరాశి
భద్ర మహాపురుష రాజయోగం కారణంగా సింహరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. సింహ రాశి వారికి ఇది అన్ని విధాలా కలిసి వస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో కష్టాల నుంచి బయటపడతారు. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. బ్యాంకింగ్, మార్కెటింగ్, మీడియా, సేల్స్ రంగాల వారికి ఇది చాలా మంచి పురోగతిని కలిగిస్తుంది.
ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి భద్ర మహాపురుష రాజయోగం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. బుధుడి రాశి మార్పు వల్ల ధనుస్సు రాశి వారు కెరీర్‌లో విజయం సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది ధనుస్సు రాశి వారికి అన్ని విధాల శుభ సమయం.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications