దీపావళికి ముందు అదృష్టం తలుపు తడుతుంది!
అష్ట గ్రహాల్లో శని కూడా ఒకటి. పురాణాల ప్రకారం సూర్యదేవుడి కుమారుడే శని. మనం చేసే మంచి చెడులను ఆధారంగా ఫలాలను ఇస్తాడు కాబట్టి ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అంటారు. రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. తిరోగమనంలో ఉన్న శని నవంబరు నాలుగోతేదీన సక్రమ మార్గంలోకి రానున్నాడు. శనిదేవుడు చేసే ప్రత్యక్ష సంచారం వల్ల కొన్ని రాశులవారికి విశేషమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
కుంభ రాశి : వీరికి మంచి సమయం ప్రారంభమైంది. ఆకస్మికంగా ధన లాభం ఉంది. వ్యాపారస్తులకు భారీగా లాభాలు వస్తాయి. కొత్త ఆర్డర్లు పొందుతారు. దీనివల్ల వారు లగ్జరీ లైఫ్ ను గడుపుతారు. ఆస్తి లేదంటే వాహనం కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం పటిష్టమవుతుంది.

వృషభ రాశి : ఈ రాశివారికి శనిదేవుడి ప్రత్యక్ష సంచారం అదృష్టాన్ని మోసుకొస్తోంది. ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభాలున్నాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. దీపావళికి ముందే వీరి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యగస్తుల కెరీర్ చాలా బాగుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు.
సింహరాశి : ఈ రాశివారికి ఊహించని ప్రయోజనాలున్నాయి. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామితో బంధం బలోపేతమవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంది. పనిచేసేచోట ప్రశంసలు లభిస్తాయి.












Click it and Unblock the Notifications