రేపు దుర్గాష్టమి సందర్భంగా ఈ రాశులకు రాజయోగం
నవరాత్రుల్లో అష్టమి చాలా ప్రత్యేకమైన రోజు. ఆరోజు శుభయోగం ఏర్పడుతోంది. ఇది అనేక యోగాలకు కారణమవుతుంది. ఒకరకంగా నాలుగు రాశులవారికి అదృష్టం తలుపు తట్టినట్లే. కొన్ని ప్రాంతాల్లో రేపు కులదేవతకు పూజలు జరుగుతుంటాయి. శరద్ నవరాత్రి అష్టమి తిథి రోజు శుభయోగం ఏర్పడటం చాలా అరుదుగా జరిగే పరిణామం. కొన్ని దశాబ్దాల తర్వాత ఇది జరగబోతోంది. అదేరోజు స్వార్ధ సిద్ధి యోగం, రవి యోగం ఉంటుంది. ఇన్ని రాజయోగాల శుభ సంయోగం మహాష్టమి నాడు ఏర్పడటం దాదాపు ఒక శతాబ్దం తర్వాత జరిగింది. ఫలితంగా కొన్ని రాశులకు అన్నీ శుభాలే జరుగుతాయి. ఏయే రాశులకు ఎలా కలిసిరానుందో తెలుసుకుందాం.
కర్కాటక రాశి : మధ్యలో నిలిచిపోయిన డబ్బులు తిరిగి చేతికందుతాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. విశేషమైన లాభాలను ఆర్జించడంతోపాటు భారీ ఎత్తున ఆర్డర్లు పొందుతారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వారికి పదోన్నతి కూడా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.

మీన రాశి : వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. పదవితోపాటు ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం ఉంది. వ్యాపారస్తులకు చాలా బాగుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. మరికొన్ని కొత్త అవకాశాలు కూడా వీరిని పలకరిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మేష రాశి : ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. కెరీర్ పరంగా మంచి లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్ వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వరిస్తాయి.
వృషభ రాశి : కుటుంబ జీవనం ప్రశాంతంగా సాగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. షేర్ మార్కెట్ లో పెట్టే పెట్టుబడులు బాగా కలిసివస్తాయి. ఆర్థికంగా బలోపేతమవుతారు. ఉద్యోగస్తులకు కూడా ఇది మంచి సమయం.












Click it and Unblock the Notifications