30 ఏళ్ల తర్వాత అరుదైన కేంద్ర త్రికోణ రాజయోగం.. వీరంతా జమిందారులే
జ్యోతిష్యంలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. నెమ్మదిగా కదిలే గ్రహాల్లో శని కూడా ఒకటి. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడానికి శనికి రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది. 30 సంవత్సరాల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సంచారం వల్ల అరుదైన త్రికోణ రాజయోగం ఏర్పడింది.
అదృష్టం తెచ్చిపెట్టే యోగాల్లో ఇది కూడా ఒకటి. త్రికోణ స్థానంలో లక్ష్మీదేవి, కేంద్ర స్థానంలో శ్రీమహావిష్ణువు ఉంటారు. త్రికోణ రాజయోగం వల్ల ఏయే రాశులవారికి కలిసిరానుందో తెలుసుకుందాం.

వృషభం: త్రికోణ రాజయోగం వృషభరాశివారికి బాగుంటుంది. సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. ఉద్యోగం లేనివారికి ఉద్యోగం వస్తుంది. దీనివల్ల ఆదాయం పెరిగి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కోరికలన్నీ నెరవేరడంతోపాటు కెరీర్ బాగుంటుంది. ఈ సమయం ఈ రాశివారికి ఎంతో అనుకూలంగా ఉంది.
సింహరాశి: ఈ రాజయోగంవల్ల వీరు అనుకున్నది సాధిస్తారు. ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సొంతమవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. గతంలో మొదలై పెండింగ్ లో పడిన పనులన్నీ పూర్తవుతాయి. వివాహం కానివారికి పెళ్లి కుదురుతుంది.. దాంపత్య జీవితం బాగుంటుంది. కోర్టు కేసులు కూడా పరిష్కారమవుతాయి.












Click it and Unblock the Notifications