ఈ రాశులవారు ఏ పని తలపెట్టినా దరిద్రం తోడుంటుంది!
జ్యోతిష్యంలో అంగారకుడిని గ్రహాల కమాండర్ గా పరిగణిస్తారు. ఈరోజు 23:07 గంటలకు ధనుస్సు రాశిలో ఉదయించనున్నాడు. అంగారకుడి పెరుగుదల 12 రాశులవారిపై అనుకూల, ప్రతికూల ప్రభావాలను ఏర్పరుస్తుంది. ధనుస్సులో కుజుడు ఉదయించడంవల్ల నాలుగు రాశులవారిపై మాత్రం తీవ్ర ప్రభావం చూపించబోతుంది. దీనివల్ల వారికి నిరంతరం అదృష్టం తోడుంటుంది. ఇంకా ఏవిధంగా వీరికి కలిసిరానుందో తెలుసుకుందాం.
సింహరాశి :కెరీర్ చాలా బాగుంటుంది. జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ చేతికందుతుంది. దీంతోపాటు ఇంక్రిమెంట్ కూడా ఉంటుందాయే. అదృష్టం తోడుంటుంది. దీనివల్ల దరిద్రం తొలగిపోతుంది. మధ్యలో నిలిచిపోయిన మీ డబ్బును తిరిగి చేతికి అందుకోవడానికి ఇది మంచి సమయం. నిరుద్యోగులకు ఉద్యోగం తోడుంటుంది.

మేషరాశి:కెరీర్ లో మంచి స్థానానికి చేరుకుంటారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే కోరిక ఇన్నాళ్లకు నెరవేరబోతోంది. ఉద్యోగం మారడానికి ఇది మంచి తరుణం. నిరుద్యోగులకు మంచి ప్యాకేజ్ దొరుకుతుంది. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ రావడానికి కూడా ఇది మంచి సందర్భం.
కర్కాటక రాశి:ధనుస్సు రాశిలో కుజుడి సంచారం వీరికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు భారీ నష్టాలున్నాయి. కెరీర్ లో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరు ఏ పని తలపెట్టిన అది ఫెయిలవుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న కలతలు తలెత్తుతాయి. ఇవి పెద్దవి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే.
మకరరాశి:ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కోరిక మాత్రం నెరవేరుతుంది. ఆరోగ్యం బాగుండదు. ఇబ్బందులు తలెత్తుతాయి. దీనిద్వారా మానసిక ఒత్తిడికి గురవుతారు. మానసిక ఆరోగ్యం కూడా చెడిపోతుంది. రుణ ఊబిలో కూరుకుపోతారు. జీవిత భాగస్వామితో ఏది మాట్లాడినా తప్పుగానే అర్థం వస్తుంది.












Click it and Unblock the Notifications