శక్తివంతంగా శని.. ఈ రాశులవారికి జాక్ పాట్ తగులుతుంది
జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిది ప్రధానమైన స్థానం. అత్యంత నెమ్మదిగా కదులుతుంటాడు. చలనంలో చిన్న మార్పు వచ్చినా రాశులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జూన్ 17వ తేదీ నుంచి తన సొంత రాశి అయిన కుంభరాశిలో శని తిరోగమనంలో ఉన్నాడు. ఈనెల 29 నుంచి తిరోగమన స్థితిలో అత్యంత శక్తివంతంగా మారనున్నాడు.
శనిగ్రహం శక్తి పెరగడంతో దాని ప్రభావం అన్ని రాశుల వారిపై ఉంటుంది. 4 రాశుల వారికి పలు ప్రయోజనాలను కల్పించబోతున్నాడు. వ్యక్తులు ఆయా రంగాల్లో విజయం సాధించడంతోపాటు వృత్తి, వ్యాపారాల్లో గొప్ప పురోగతిని పొందుతారు. లాభించబోయే రాశుల వివరాలు తెలుసుకుందాం.

వృషభ రాశి: ఈ రాశివారికి మంచిరోజులు ప్రారంభమవుతాయి. అదృష్టం తోడుగా ఉంటుంది. ఇతరులు గుర్తించేంతటి స్థాయిలో విజయాన్ని పొందుతారు. అభివృద్ధి ఉంటుంది. ధనం, ధాన్యాలను పొందడంతోపాటు కోరిక నెరవేరుతుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చిస్తారు.
మిథున రాశి : వీరికి శని అనేక ప్రయోజనాలను కల్పించనున్నాడు. తండ్రి ఆరోగ్యం బాగవడంవల్ల ఉపశమనం పొందుతారు. త్వరలోనే జాక్ పాట్ తగులుతుంది. ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉంటారు. లాభపడతారు. ఏ పనిని ప్రారంభిస్తున్నా జీవిత భాగస్వామితో చర్చించి సలహాలు తీసుకోవడంవల్ల అది భారీగా విజయవంతమవుతుంది.
తుల రాశి : వివాదాస్పద విషయాల్లో గెలుపొందారుతారు. ప్రత్యర్థులు ఓటమిపాలవుతారు. ఇబ్బంది పెడుతున్న అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడతారు. శాంతి లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మికంగా వచ్చే ధనం మీ బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచుతుంది. కుటుంబ సభ్యుల్లో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.












Click it and Unblock the Notifications