200 ఏళ్ల తర్వాత కీలక పరిణామం.. డబ్బుకు లోటే ఉండదు
సుమారు 200 ఏళ్ల తర్వాత రాఖీ పూర్ణిమకు అరుదైన కలయిక ఏర్పడబోతోంది. ఆరోజు సూర్యుడు, బుధుడు, చంద్ర గ్రహాలు అనుకూలమైన అమరికలో ఉంటాయి. దీన్ని రవి యోగం, శతభిషా నక్షత్రం, బుధాదిత్య యోగం అంటారు. ఈ కలయిక మూడు రాశులవారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది. దీనివల్ల వారికి డబ్బుకు లోటుండదు.
సూర్యుడు అనుకూల స్థానంలో ఉన్నప్పుడు రవియోగం ఏర్పడుతుంది. ఇది విజయాన్ని, సంపదను, శ్రేయస్సును కల్పిస్తుంది. శతభిషా నక్షత్రం ఆధ్యాత్మికత, శాంతితో ముడిపడివుంటుంది. బుధుడు, సూర్యుడు అనుకూలంగా ఉన్నప్పుడు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. రక్షా బంధన్ రోజు 3 గ్రహాలు కలుస్తుండటంవల్ల వారి జీవితం మారిపోనుంది. లక్ష్మీదేవి అనుగ్రహించడంవల్ల భారీగా సంపదను కూడబెడటంతోపాటు వ్యాపారాలు కూడా వృద్ధి చెందుతాయి.

సింహ రాశి : ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది. రక్షా బంధన్ రోజు వారు పెట్టే పెట్టుబడులకు మంచి రాబడి వస్తుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామితో బంధం బలోపేతమవుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
ధనస్సు రాశి : వీరిని అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో ఇంక్రిమెంట్ తో పాటు పదోన్నతి లభిస్తుంది. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ధనాభివృద్ధి ఉంది.
మిథున రాశి : రక్షాబంధన్ రోజు ఈ రాశివారు ఆర్థికంగా స్థిరపడతారు. డబ్బు సంపాదించడమేకాకుండా దాన్ని పొదుపు కూడా చేస్తారు. గతంలో మొదలై ఆగిపోయిన పనులన్నంటినీ పూర్తిచేయడానికి ఇది మంచి సమయం. పనులు పూర్తిచేయడానికి అవసరమైన ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది.












Click it and Unblock the Notifications