శని రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులవారు పట్టుకుందల్లా బంగారమే

జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు వ్యక్తుల జాతకాల్లో శుభ స్థానంలో ఉంటే వారికి అన్నివిధాలుగా తిరుగుండదు. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో లగ్జరీ జీవితానికి, ఆనందానికి, శ్రేయస్సుకు శుక్రుడిని కారకుడిగా భావిస్తారు. ఈ ఏడాదిలో తొలిసారి మార్చి నెలలో శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. కుంభ రాశిని శనిదేవుడి రాశిగా పరిగణిస్తారు. ఏడాది తర్వాత శుక్రుడు ఇందులోకి ప్రవేశించడంవల్ల మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. ఏయే రాశులవారికి ఇలా కలిసి రానుందో తెలుసుకుందాం.

కుంభ రాశి : శుక్రుడి సంచారం ఈ రాశిలోనే జరగుంది. దీనివల్ల విద్యార్థులకు మంచి ఫలితాలున్నాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య శృంగార సమయం పెరుగుతుంది. వివాహం కానివారికి వివాహం కుదురుతుంది. ఆధ్యాత్మిక పరమైన, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తను వింటారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నింటినీ ఈ సమయంలో పూర్తిచేస్తారు. ఇది ఎంతో అనుకూలమైన సమయం.

these zodiac sign people are very lucky due to Venus Transit 2024

వృషభ రాశి : వ్యాపారస్తులకు లాభాలున్నాయి. వ్యాపారపరంగా వారికున్న కోరికలను కూడా నెరవేర్చుకుంటారు. ఉద్యోగస్తులకు మార్పులు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ద తీసుకోవాలి. మీడియా, కళలు రంగాల్లో ఉన్నవారితోపాటు వ్యాపారవేత్తలకు కూడా ఊహించని రీతిలో లాభాలు కలుగుతాయి. ఇంక్రిమెంట్ తో కూడిన ప్రమోషన్ ను ఉద్యోగులు పొందుతారు.

తులారాశి : పూర్వీకుల నుంచి ఆస్తులను పొందుతారు. రాశివారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. వీరిపైనే ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ప్రయాణాలు చేస్తారు.. వీటివల్ల లాభాలున్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+