ఫిబ్రవరిలో శనిదేవుడికి ఇష్టమైన రాశులు.. వీరిపై లక్ష్మీదేవి కుంభవృష్టి
జ్యోతిష్యంలో గ్రహ సంచారాలకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. కారణం.. గ్రహాలు ఇతర గ్రహాలతో కలవడంవల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. ప్రధానంగా శనిదేవుడి లాంటివారు సంచారం చేస్తే అన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. ఈనెల 11వ తేదీ సాయంత్రం శని కుంభరాశిలో కదలికలు జరపడంవల్ల కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది. ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.
తులా రాశి:కుంభరాశిలో శని అస్తమించడంవల్ల ఈ రాశివారు ఆస్తులు, కార్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పలు సమస్యల నుంచి కూడా బయటపడతారు. సౌకర్యవంతమై. జీవితాన్ని గడుపుతారు. పూర్వీకుల నుంచి ఆస్తి వస్తుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ఇది మంచి సమయం. వైవాహిక జీవితంలో ఉన్నవారికి జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది.

మిథున రాశి:దీర్ఘకాలం నుంచి పరిష్కారం కాని పనులన్నింటినీ పూర్తిచేస్తారు. ప్రధానంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నవారికి చాలా బాగుంటుంది. కష్టాలను అధిగమిస్తారు. వైవాహిక జీవితం కలిసివస్తుంది. వ్యాపారాల్లో లాభాలున్నాయి. పెళ్లికానివారికి శుభవార్తలు ఉన్నాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ ఈ సమయంలో సజావుగా పూర్తిచేస్తారు.
మేష రాశి:సమాజంలో గౌరవ మర్యాదలు లభించడంతోపాటు కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఇతర కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు కలగడంతోపాటు ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించడంవల్ల పనులన్నింటినీ ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు.












Click it and Unblock the Notifications