2 ఏళ్ల తర్వాత ఈ రాశుల పంట పండింది
ధైర్యానికి, పరాక్రమానికి ప్రతీక అయిన కుజుడు వ్యక్తి జాతకంలో శుభస్థానంలో ఉంటే ఆ జాతకుల జీవితం పూర్తిగా మారిపోతుంది. అన్ని సౌకర్యాలు సమకూరడమే కాదు.. జీవితం ఆనందమయంగా సాగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు రాశి సంచారం చేయడంతోపాటు నక్షత్ర సంచారం కూడా చేస్తాడు. కృత్తిక నక్షత్రంలో సంచరించిన అంగారకుడు ఈనెల 22వ తేదీన రోహిణీ నక్షత్రంలోకి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రవేశించాడు. ఇలా అంగారకుడు సంచారం చేయడంవల్ల ఏయే రాశులకు కలిసి వస్తుందనే విషయాన్ని జ్యోతిష్య పండితులు తెలియజేశారు.
వృషభ రాశి
అంగారకుడి నక్షత్ర సంచారం వీరి జీవితంలో ఊహించని మార్పులను తీసుకువస్తుంది. వ్యాపారస్తులకు శుభవార్తలను అందుకొని ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. దీనివల్ల అన్ని పనులను పూర్తిచేసి పేరుపొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావడంవల్ల ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. కొంతకాలం నుంచి పెండింగ్ లో ఉన్న న్యాయపరమైన విషయాల్లో తీర్పు అనుకూలంగా వస్తుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

మేష రాశి
కన్న తల్లికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి మంచి శుభవార్తను అందుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరగడంతో అనుకున్న పనులను సులువుగా పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు వారి వ్యాపారాలకు సంబంధించి కొత్త ఒప్పందాలు కుదురుతాయి. అంతేకాకుండా ఈ సమయం వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొన్నాళ్ల క్రితం మొదలై నిలిచిపోయిన పనులను ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తిచేస్తారు.
మకర రాశి
అంగారకుడి అనుగ్రహం దండిగా లభిస్తుండటంతో సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతోపాటు కీర్తి కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులను వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. లాభాలను పొందుతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ పూర్తవడంతోపాటు ఆర్థికంగా బలోపేతమవుతారు. పూర్వీకుల నుంచి ఆస్తి కలిసివస్తుంది. పెద్దల నుంచి ఆశీర్వాదం పొందుతారు.












Click it and Unblock the Notifications