ఈనెల 28వ తేదీ నుంచి ఈ రాశులకు బ్యాంకు చెక్కులిస్తున్న బృహస్పతి

మరో ఆరు రోజుల్లో దేవ గురువు బృహస్పతి రోహిణీ నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల అన్ని రాశులవారిపై ప్రభావం పడుతోంది. మూడునెలలు ఇదే నక్షత్రంలో బృహస్పతి ఉండటంవల్ల ఈ మూడు నెలలు ఈ రాశులవారు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. జ్యోతిష్యం ప్రకారం మనకున్న 27 నక్షత్రాల్లో మృగశిర నక్షత్రం ఐదోది.

ఈ నక్షత్రంలో జన్మించినవారు తెలివితేటలతో, నిజాయితీతో ఉంటారు. ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువ. మృగశిర నక్షత్రంలో సగభాగం వృషభరాశిలో, మరో సగభాగం మిథునరాశిలో ఉంటుంది. ఈ నక్షత్రంలో గురువు సంచారంవల్ల ఏ రాశులవారికి లాభం చేకూరుతుందో తెలుసుకుందాం.

these zodiac signs very lucky due to jupiter transit in mrugasira nakshatram

సింహ రాశి
వృత్తిలో అభివృద్ధి చెందుతారు. ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్నచోట ఇతర ఉద్యోగుల నుంచి సంపూర్ణమైన మద్దతును పొందుతారు. కెరీర్ పరంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవడంతోపాటు పై అధికారుల నుంచి పనితీరుపై ప్రశంసలు అందుకుంటారు. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు బాగుంటుంది.

ధనుస్సు రాశి
వీరికి జీవితంలోని ప్రతి రంగంలో అనుకూలమైన ఫలితాలనే పొందుతారు. ఈ మూడునెలలు విపరీతమైన సంతోషాన్ని పొందుతారు. పూర్వీకుల నుంచి ఆస్తి వస్తుంది. దానిద్వారా ఆర్థిక లాభాలు కలిగి మంచి ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. కుటుంబ జీవితం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది.

వృషభ రాశి
ఉద్యోగస్తులకు వృత్తిలో పురోగతి ఉంది. ప్రమోషన్ రావడంతోపాటు వేతనాలు కూడా పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఈ సమయం వీరికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయి అందరి మధ్య అనుబంధం బలపడుతుంది. ఆప్యాయత పెరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+