లక్ష్మీనారాయణ రాజయోగంతో ఈ రాశులవారు కుబేరులవుతున్నారు
ఈనెల ఏడోతేదీన శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. బుధుడు కూడా ఈనెల 29వ తేదీన ఇదే రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీనివల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతోంది. 31వ తేదీన బుధుడు శుక్రుడితో కలిసి సంయోగం చేస్తాడు. దీనివల్ల మూడు రాశులవారికి జీవితం అంతా శుభప్రదంగా గడుస్తుందని, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. లక్ష్మీనారాయణ రాజయోగంతో ఏ రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.
మిథున రాశి
ఈ రాశివారికి అదృష్టం కలుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయడంతోపాటు కొత్త ఆదాయ వనరులు పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు లాభాలున్నాయి. వీరికి ప్రమోషన్ తోపాటు వేతనం పెరుగుతుంది. శ్రేయస్సుతోపాటు ఆనందం లభిస్తుంది. ఎటువంటి పనినైనా సులువుగా పూర్తిచేసే నైపుణ్యం వీరి సొంతం. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.

కర్కాటక రాశి
వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. పెట్టుబడులకు సంబంధించి మంచి లాభాలను స్వీకరిస్తారు. కొత్త ఇంటితోపాటు పలు భవనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అదృష్టం తోడుండటంవల్ల గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తవుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.
మకర రాశి
అనేక శుభవార్తలను వింటారు. జీవిత భాగస్వామితో శృంగార కోరిక తీరుతుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికి బాగుంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. పెళ్లికానివారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పనులు వేగంగా పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు.












Click it and Unblock the Notifications