కుజుడి సంచారంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్లే
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులవారికి సానుకూల ఫలితాలు కలిగితే, మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. ఆగస్టు 26న జన్మాష్టమి రోజు కుజుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
ఆస్తి, భూమి, సాహసం, విజయం, ధైర్యం, శక్తికి కుజుడు ప్రతీక. వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే ఆరోగ్యం, ధైర్యం, విజయం కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. జన్మాష్టమి రోజు కుజుడి సంచారం వల్ల కొన్ని రాశులవారికి మంచి ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

మేష రాశి
విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు మంచి పేరు సంపాదించుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ప్రధానమైన పనిని పూర్తిచేస్తారు. దీనివల్ల ఆర్థికంగా ప్రయోజనాలు దక్కుతాయి. ఆరోగ్యంపట్ల ఈ రాశివారు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యర్థులపై విజయం దక్కుతుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగి ఎటువంటి పనినైనా సులువుగా పూర్తిచేస్తారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తలిద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది.
సింహం రాశి
ఈ రాశివారికి ఈ సమయం ఎంతో అమూల్యమైనదని చెప్పొచ్చు. కుజుడి సంచారంవల్ల వీరికి సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి. భగవంతుణ్ని ఆరాధించడంవల్ల అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. సింహరాశిలో జన్మించినవారు వృత్తిలో, ఉద్యోగాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ సమయంలో పూర్తిచేస్తారు. పనిచేసేటప్పుడు ఎవరిపై ఎక్కువగా ఆధారపడకుండా మనమీద నమ్మకంతో ఉండాలి. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు.












Click it and Unblock the Notifications