100 ఏళ్ల తర్వాత ఈ రాశులవారు పట్టుకుందల్లా బంగారమే
మీనరాశిలో శుక్రుడు, సూర్యుడు, బుధుడి కలయిక ఏర్పడుతుంది. సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తారు. అదే సమయానికి శుక్రుడు, బుధుడు కలవడంవల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల జాతకులకు లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు.. డబుల్ రాజయోగం ఏర్పడబోతోంది. ఈ ప్రభావంవల్ల ఏయే రాశులవారికి మంచి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం.
వృషభ రాశి
ఉద్యోగస్తులకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. చిన్న చిన్న సమస్యలను భాగస్వామితో చర్చించి పరిష్కరించుకుంటారు. వైవాహిక జీవితంలో చికాకు వాతావరణం తొలగిపోతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన ప్రదేశాలను సందర్శిస్తారు.

సింహ రాశి
బుధుడి ప్రభావంతో ఆగిపోయిన పనులను పూర్తిచేస్తారు. కొత్త పని ప్రారంభించేందుకు లక్ష్మీదేవి అనుగ్రహం బాగుంటుంది. ఆనందం, సంపద పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం వాహనం లేదంటే ఆస్తిని కొనుగోలు చేస్తారు. లక్ష్మీదేవి కటాక్షంతో ఆదాయం పెరుగుతుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
మీన రాశి
ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ రాశివారికి పట్టిందల్లా బంగారంలా మారుతుంది. పెట్టుబడులు రావడంతో సంతోషంతో మనసు నిండిపోతుంది.
ఈ మూడు గ్రహాల ప్రభావంతో వ్యాపార లావాదేవీలవల్ల సంపద పెరుగుతుంది. ధైర్యసాహసాలుంటాయి. గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. పనిలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలను వింటారు. లావాదేవీలకు మంచి సమయం. డబ్బుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. పెట్టబడుల నుంచి లాభాలను అందుకుంటారు.












Click it and Unblock the Notifications