ఎల్లుండి నుంచి ఈ రాశులవారిపై కనక వర్షం
ఎన్నో శుభాలను అనుగ్రహించే శుక్రుడు ఈరోజు నుంచి మిథునరాశిలో సంచారం చేయనున్నాడు. దీనివల్ల ఎంతో ప్రాముఖ్యత కలిగిన లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతోంది. అలాగే 14వ తేదీన బుధుడు ఇదే రాశిలో సూర్యుడితో కలుస్తుండటంవల్ల బుధాదిత్య రాజయోగం, తర్వాత రోజు నుంచి శక్తివంతమైన త్రిగ్రాహి రాజయోగం కూడా ఏర్పడబోతున్నాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులవారి జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఒకరకంగా వారికి స్వర్ణయుగం ప్రారంభమైనట్లేనంటున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.
వృషభ రాశి
స్థిరాస్తి వ్యాపారం వీరికి బాగా కలిసివస్తుంది. వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి. ఎటువంటి పనులు చేపట్టినా మంచి విజయం సాధించగలుగుతారు. గతంలో నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో పూర్తిచేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉన్నాయి. నిలిచిపోయిన ధనం కూడా చేతికి అందుతుంది. అన్ని పనులు పూర్తయ్యేవరకు అదృష్టం తోడుంటుంది.

మిథునరాశి
ఈ రాశివారికి ఆర్థికంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. పెండింగ్ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. బ్యాంక్ లో ఉన్న బ్యాలెన్స్ రెట్టింపు అవుతుంది. ఉద్యోగస్తులకు వారి కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం లభిస్తుంది. దీనివల్ల ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. ఖర్చులు కూడా తగ్గుతాయి. వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతుంది.
సింహ రాశి
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతితోపాటు వేతనాలు కూడా రెట్టింపు అవుతాయి. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం బాగుంటుంది.
కన్యా రాశి
కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు లేదంటే ఆధ్యాత్మిక పరమైన యాత్రకు వెళతారు. దీనివల్ల మానసిక ప్రశాంతత లభించి పనులన్నింటినీ ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. గతంలో ఉన్న వివాదాలన్నీ తొలగిపోతాయి. వీరికి ఆనందం, శ్రేయస్సు రెట్టింపు అవుతాయి. ధనలాభాలు అధికంగా ఉన్నాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారికి అన్నీ అనుకూలంగానే సాగుతాయి.












Click it and Unblock the Notifications