ఈ రాశులు పట్టిందల్లా బంగారమే అవుతుంది

గడిచిన మూడు రోజుల్లో అత్యంత అరుదైన గ్రహాల కలయిక జరిగింది. చంద్రుడు కుంభరాశిలో, బుధుడు సింహరాశిలో, సూర్య సింహరాశిలో, శనిదేవుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. భానుడు, శని, చంద్రుడు, బుధుడి కలయికవల్ల సమ సప్తకం ఏర్పడటం విశేషం. ఇటువంటి గ్రహాల యుతివల్ల కొన్ని రాశులు ఆర్థికంగా లాభపడ్డాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.

మేషం
కలలో కూడా ఊహించనిరీతిలో శుభ పరిణామాలు జరుగుతాయి. రాజపూజ్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నవారు ఉన్నతస్థాయికి చేరుకుంటారు. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది.

these zodiac signs will get more money due to rarest planetiry position

వృషభం
వీరికి ఇంటి, వాహన సౌకర్యం కనపడుతోంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా బలంగా తయారవుతారు. పిల్లలు లేనివారికి సంతానయోగం ఉంది.

సింహం
వీరు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు వృద్ధి చెందుతారు. వీరికి మంచి మంచి అవకాశాలు తలుపుతడతాయి. వ్యక్తిగతంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రాధాన్యం పెరగడంతోపాటు పరిచయాలు వృద్ధి చెందుతాయి.

తుల
వివిధ మార్గాల్లో వీరికి ఆదాయం పెరుగుతుంది. డబ్బు సంపాదనకు సంబంధించిన ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగులకు విదేశీ అవకాశాలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా మారతాయి. కుటుంబంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి.

ధనుస్సు
ఎక్కువ శుభవార్తలను వింటారు. పలు శుభపరిణామాలు ఇంట్లో చోటుచేసుకుంటాయి. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. న్యాయ సంబంధమైన వివాదాలు పరిష్కారమై ఎంతో విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఏ పని తలపెట్టినా విజయం అందుకుంటారు.

కుంభం
సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంట్లో, బయట గౌరవం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. కోరుకున్న శుభవార్త చెవిన పడుతుంది. కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+