ఎల్లుండి నుంచి ఈ రాశులకు ఐశ్వర్యం
గ్రహాల సంచారం జాతకుల జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. రాక్షసుల గురువైన శుక్రుడు ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం 2.47 గంటలకు పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించి వచ్చేనెల మూడోతేదీ వరకు అక్కడే ఉంటాడు. తర్వాత ఉత్తరాభాద్రలోకి వెళతాడు. పూర్వాభాద్రకు అధిపతి గురువు. ఈ నక్షత్రంలో పుట్టినవారు అదృష్టవంతులు. గురువుకు చెందిన నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడంవల్ల మూడు రాశులవారికి గతంలో ఎన్నడూ లేని ప్రయోజనాలను పొందుతారు.
కన్యా రాశి
ఈ రాశివారికి అంతా సానుకూలంగా ఉంటుంది. కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. అప్పుల ఊబి నుంచి బయటపడతారు. ప్రేమలో విజయం ఉంది. పనిచేసేచోట తోటి ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. సంతానం కలుగుతుంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో మంచి విజయాన్ని సాధిస్తారు.

కర్కాటక రాశి
ఈ రాశివారికి అదృష్టంతోపాటు ఐశ్వర్యం కూడా రాబోతోంది. కెరీర్ లో మంచి స్థాయికి చేరుకుంటారు. గతం కంటే మెరుగా ఆర్థిక పరిస్థితి ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి బయటపడటంతోపాటు పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. కార్యాలయంలో చేసిన ప్రాజెక్టులు విజయవంతం కావడంతో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
మేష రాశి
వ్యాపారంలో గతంలో వచ్చినవాటికంటే ఎక్కువ లాభాలను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. దేంట్లో పెట్టుబడి పెట్టినప్పటికీ అవి రెట్టింపు లాభాలను తీసుకువస్తాయి. కోరికలు నెరవేరతాయి. పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. విద్యార్థులకు బాగుంటుంది. విదేశాల్లో విద్యనార్జించాలనుకునేవారికి కోరికలు నెరవేరే సమయం ఇది.












Click it and Unblock the Notifications