ఆషాఢ మాసంలో రెండు అద్భుత యోగాలు.. ఈ రాశులు ఆర్థికంగా బలపడతారు
ఈనెల ఐదోతేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఆషాఢ అమావాస్య సమయంలో బుధుడితోపాటు చంద్రుడు కూడా మిథున రాశిలో సంయోగ దశలో ఉన్నాయి. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన గ్రహాలు నక్షత్ర సంచారం చేయనున్నాయి. వీటివల్ల ధ్రువ యోగం, సర్వార్థ సిద్ధి యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రెండింటికితోడు ఆరుద్ర నక్షత్రంలో కొన్ని గ్రహాల కలయిక ఉంది. వీటి ప్రభావంతో కొన్ని రాశులవారి అన్ని విధాలుగా కలిసివస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
తులారాశి
పాత ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్థికంగా డబ్బులు సంపాదించేందుకు అనేక మార్గాలు తోడవుతాయి. వ్యక్తిగత జీవితంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు. ఆర్థికంగా బలోపేతమవుతారు.

సింహరాశి
ఏ పని తలపెట్టినా అదృష్టం తోడుండి విజయవంతంగా పనిపూర్తయ్యేలా చూస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులున్నాయి. కొత్తగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది. ఆర్థికంగా స్థిరపడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలగడంతోపాటు కొత్త మిత్రులు పరిచయం అవుతారు.
వృషభ రాశి
కష్టపడి పనిచేసి మంచి గుర్తింపును పొందుతారు. కఠినమైన పనుల్లో కూడా సులువుగా విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు లభ్యమవుతాయి. వచ్చిన డబ్బులతో పెట్టుబడులు పెడతారు. వ్యక్తిగత జీవితం ఎంతో ఆనందంగా గడుస్తుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను పూర్తిచేయగల సామర్థ్యం అబ్బుతుంది.
ధనస్సు రాశి
ఉద్యోగంలో కొత్త సవాళ్లు ఎదురవుతాయి. అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కెరీర్ బాగుండటంతోపాటు పొదుపు చేయడంపై దృష్టిసారిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు పెట్టబడులు పెడతారు. అవన్నీ మీకు లాభసాటిగా మారి ఆదాయాన్నిస్తాయి. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. చిన్న చిన్న వివాదాలన్నీ సమసిపోతాయి. పిల్లల నుంచి శుభవార్తలను వినడంతోపాటు వారికి సంబంధించిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి.












Click it and Unblock the Notifications