శని తిరోగమనంతో ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
జ్యోతిష్యం ప్రకారం శనిదేవుడిని అశుభానికి చిహ్నంగా భావిస్తారు. ఆయన న్యాయదేవత. మనం చేసిన కర్మల ప్రకారం ఫలితాలను అనుగ్రహిస్తుంటాడు. జీవితం విలువ ఆయనవల్లే తెలుస్తుంది. ఆయన పెట్టే కష్టాలే మన జీవితం మలుపు తిరగడానికి కారణమవుతాయి. అయితే ఈ విషయాలు తెలసుకోకుండా శనిదేవుడు కష్టాలనిస్తాడంటూ అందరూ నిందిస్తుంటారు. దీపావళి తర్వాత నవంబరు రెండోవారంలో తిరోగమనం చేస్తుండటంవల్ల కొన్ని రాశులవారికి ధనలాభం కలుగుతోంది. ఏయే రాశులవారికి ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
మేష రాశి
శని తిరోగమనం ఈ రాశివారికి చాలా బాగుంటుంది. ఉన్నత స్థాయికి చేరుకోవడంతో ఏ రంగంలో పెట్టుబడులు పెట్టినా అదృష్టం తోడుండటంవల్ల కలిసివస్తుంది. విద్యార్థులు చదువులో చురుగ్గా ఉంటారు. ఉద్యోగస్తులకు కొత్త ఆఫర్లు అందుతాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వేతనం పెరగడంతోపాటు పదోన్నతి ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

వృషభ రాశి
ఆదాయం పెరగడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. చిన్న చిన్న పనులు చేసినా పెద్ద విజయాలు అందుకుంటారు. ఎప్పటినుంచో అనుకుంటున్న పనులు పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామితో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు.
తుల రాశి
కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడంతోపాటు తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. న్యాయ పరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి పనిలో మద్దతు లభిస్తుంది.
ధనుస్సు రాశి
వృత్తి జీవితం గడుపుతున్నవారికి మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. చేపట్టిన ప్రతి పనిలో గెలుపొందుతారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. శనిదేవుడిని పూజించడంవల్ల ధనలాభాలు మెరుగుపడతాయి.












Click it and Unblock the Notifications