ఈ రాశులవారికి రాబోయే 17 రోజులు అష్టైశ్వర్యాలు
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కో గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. ఈ గ్రహాలకు యువరాజులాంటివాడు బుధుడు. వ్యాపారానికి, బుద్ధికి, అభివృద్ధికి కారకుడు. అలాంటి బుధుడు వక్రమార్గం వల్ల కొన్ని రాశులపై వరాల జల్లు కురవనుంది. అంతులేని ధనసంపదలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.
ఆగస్టు 24 నుంచి బుధుడు వక్రమార్గంలో ఉన్నాడు. సెప్టెంబర్ 15 వరకూ అక్కడే కొనసాగనున్నాడు. రానున్న 17 రోజులు కర్కాటక రాశి, తులారాశి, వృషభరాశి జాతకులకు అత్యద్భుతంగా ఉండనుంది. వీరికి అంతులేని ధన సంపదలు కలగనున్నాయి. కెరీర్ పరంగా వ్యాపారం విషయంలో చాలా లాభదాయకమైన సమయం. అనారోగ్యం తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం బాగుండటంతో ఆర్ధికంగా ఈ మూడు రాశులవారికి ఎటువంటి మస్యలు ఉత్పన్నం కావు. ఆయా రాశుల వివరాలు తెలుసుకుందాం.

కర్కాటక రాశి: బుధుడి వక్రమార్గంవల్ల కర్కాటక రాశివారు కొత్త పనులు ప్రారంభించవచ్చు. దీనివల్ల వారికి కలిసివస్తుంది. ఆ పని విజయవంతమవుతుంది. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవితం లగ్జరీగా గడుస్తుంది. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఊహించనిరీతిలో కనకవర్షం కురుస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి.
తులా రాశి: వీరి కోరికలన్నీ నెరవేరతాయి. సంతోషంగా గడుపుతారు. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది మంచి సమయం. పెద్ద పెద్ద ఆర్డర్లు చేతికి వస్తాయి. దీనివల్ల వ్యాపారాన్ని విస్తరిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది.
వృషభ రాశి: ఉద్యోగం మారేందుకు అనువైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కెరీర్ లో అభివృద్ధి సాధిస్తారు. అంతులేని ధన సంపదలు పొందుతారు. బుధుడు ధనానికి కారకుడవడంతో వీరికి డబ్బు పరంగా లోటుండదు. ఆరోగ్యం బాగుంటుంది.












Click it and Unblock the Notifications