నవంబరు 4 నుంచి వీరంతా జమిందారులే
ప్రతి గ్రహం ఏదో ఒక సమయంలో రాశి సంచారం చేస్తుంది. కానీ శని గ్రహం చాలా అరుదుగా సంచారం చేయడంతోపాటు తిరోగమనం చేస్తుంది. దాదాపు ఐదు నెలల తర్వాత శని నవంబరు నాలుగోతేదీన రాశి సంచారం చేయనుంది. దీనివల్ల కొన్ని రాశులవారు ఆర్థికంగా లాభపడతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శని వచ్చే నెల నాలుగున తిరోగమనం చేయబోతున్నాడు. ఏయే రాశులవారికి లాభాలు, ఏయే రాశులవారికి నష్టాలు అనే విషయాలను తెలుసుకుందాం.
వృషభ రాశి:ఆర్థికంగా లాభాలున్నాయి. భవిష్యత్తు బాగుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు. ఉద్యోగాలు చేసేవారికి తాము పనిచేసేచోట ప్రశంసలే కాకుండా ఇంక్రిమెంట్ తో కూడిన ప్రమోషన్ లభిస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది. వ్యాపారస్తులకు ఇది అనుకూల సమయం.

సింహం రాశి:అదృష్టం తోడుండటం వల్ల కష్టాలు తీరతాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తిస్థాయిలో మద్దతు దొరుకుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఊహించని స్థాయిలో సపోర్ట్ చేస్తారు.
కుంభ రాశి:శని ప్రత్యక్షంగా ఉండడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ధైర్యం, విశ్వాసం పెరిగి అనేక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారికి విజయం కలుగుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా లాభాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications