అరుదైన కుబేర రాజయోగం... ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే
పవిత్రమైన కార్తీక మాసం అందరికీ ఎంతో ప్రీతి. శివ కేశవులనే భేదం లేకుండా సమస్త బ్రహ్మాండమంతా ఒకటి అనే అర్థం తెలుసుకోవడమే కార్తీకమాసంలోని పరమార్థం. ఈ మాసంలో గ్రహాలు సంచారం చేయడం, తిరోగమనంలో ఉండటంలాంటివి జరుగుతుంటాయి. దీనివల్ల యోగాలు ఏర్పడుతుంటాయి. దాదాపు 64 సంవత్సరాల తర్వాత కార్తీకంలో అరుదైన కుబేర రాజయోగం ఈనెల ఆరోతేదీన ఏర్పడింది. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ యోగంవల్ల కొన్ని రాశులవారి జీవితాలు ధనంతో నండిపోతాయి. జీవితంలో ఇంతవరకు చూడని ధనాన్ని చూస్తారు. కుబేరుడి అనుగ్రహం లభించడంతో జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు రాదు. ఏయే రాశులవారిని కుబేరుడు అనుగ్రహించాడంటే...
మీన రాశి
పెళ్లికానివారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది.. లభిస్తాడు. ఏ పని అనుకున్న సులువుగా పూర్తవుతుంది. అన్ని పనులను అద్భుతంగా పూర్తిచేయగలిగే సామర్థ్యం మీ సొంతమవుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో మీరు చేసే పనుల వల్ల ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకుంటారు.

మేష రాశి
కొన్నాళ్ల నుంచి ఇబ్బంది పెడుతున్న న్యాయపరమైన విషయాల్లో కోర్టు కేసులు వీరికి అనుకూలంగా తీర్పులిస్తాయి. గతంలో ఎవరితోనైనా, ఏ విషయంలోనైనా వివాదాలుంటే ఈ సమయంలో అవి సమసిపోతాయి. ఇక రాదు అనుకున్న డబ్బు కూడా చేతికి రావడంతో ఆనందానికి అవధులుండవు. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ సమయంలో బాగా కలిసివస్తుంది. పెట్టుబడి పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మేలు కలుగుతుంది.
ధనస్సు రాశి
రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. దీనివల్ల అన్నీ లాభాలే కలిగి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఎప్పటికప్పుడు ఈ పరిస్థితులన్నీ మెరుగుపడతాయి. అలాగే ఎప్పటినుంచో కలలు కంటున్న సొంతింటి కల నెరవేరుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. దాంపత్య జీవితంలో మనస్పర్థలు తొలగిపోతాయి. వీరితో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు.












Click it and Unblock the Notifications