బుధాదిత్య, శుక్రాదిత్య యోగాలతో ఈ రాశులకు అఖండ కుబేర రాజయోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖగోళంలో రెండు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. మార్చి 29న శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. అదే నెల 14వ తేదీన సూర్య భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించివున్నాడు. అప్పటికే అక్కడ బుధుడు, శుక్రుడు సంచారం చేస్తున్నాయి. సూర్యుడు, బుధుడు, శుక్రుడి కలయికతో బుధాదిత్య యోగం, శుక్రాదిత్య యోగం ఏర్పడ్డాయి. ద్వాదశ రాశులపై ప్రభావం చూపుతున్న ఈ రెండు రాజయోగాలవల్ల కొన్ని రాశులవారికి మంచి ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఏయే రాశులకు ఏవిధంగా ఆ ప్రయోజనాలు కలిగి లాభపడతారనే విషయాన్ని తెలుసుకుందాం.

తులా రాశి
ఈ రాశి 6వ ఇంట్లో ఈ రెండు యోగాలు ఏర్పడ్డాయి. పలు రూపాల్లో ఈ రాశివారు ధనాన్ని పొందుతారు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. శారీరక ఆరోగ్యానికి సంబంధించి, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తిచేయగులుగుతారు. ఉద్యోగస్థులు తాము పనిచేస్తున్నచోట పదోన్నతి పొందుతారు. అన్ని పనుల్లోను విజయాన్ని అందుకుంటారు.

three zodiac signs will become millionaires due to bhudaditya and sukraditya rajayogas

ధనుస్సు రాశి
ఈ రాశివారి 4వ ఇంట్లో ఈ యోగాలు ఏర్పడ్డాయి. అదృష్టం తోడుండి ఇతరుల నుంచి పూర్తి మద్దతు దొరుకుతుంది. వ్యాపారంలో ఊహించనిరీతిలో లాభాలు రావడంతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన మద్దతు లభించి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. మీ పనితీరుపై ఇతరులు గౌరవిస్తారు. పనికి సంబంధించి చేసే దూర ప్రయాణాలు కూడా లాభసాటిగా మారతాయి. ధన ప్రవాహం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడంపైనే మీ భవిష్యత్తు ఆధారపడివుంటుంది.

వృషభ రాశి
ఈ రాశికి చెందిన 11వ ఇంట్లో ఈ యోగాలు ఏర్పడ్డాయి. దీనివల్ల వీరికి ధనప్రవాహం ఉంది. ప్రేమలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. తీర్థయాత్రలకు, లేదంటే విహారయాత్రలకు వెళతారు. పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. ఎదుటివారు గౌరవిస్తారు. మీకు కూడా ఎదుటివారిపై గౌరవం కలుగుతుంది. ఆరోగ్యం గురించి ఎటువంటి ఆందోళన అవసరంలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+