మార్చి 2న భాద్రపదంలోకి శని... వచ్చే డబ్బును జాగ్రత్తగా దాచుకోవాలి
న్యాయదేవతగా పరిగణించే నవగ్రహాల్లోకి కీలక గ్రహమైన శనిదేవుడు తన సొంత రాశి కుంభరాశి నుంచి మార్చి 28న మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆయన అనురాధ, పుష్య, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు అధిపతి. మీనరాశిలోకి ప్రవేశించేముందు మార్చి రెండోతేదీన భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు నక్షత్ర సంచారం చేయడంవల్ల కొన్ని రాశులవారికి విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి. వారి జీవితాల్లో సంతోషం వెల్లివిరుస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. శని నక్షత్ర సంచారం ఏయే రాశులకు, ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మీనరాశి
విద్యార్థులు మంచి విజయాలను నమోదు చేస్తారు. జీవితం మనశ్శాంతిగా సాగుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని పనులు సంపూర్ణంగా పూర్తిచేస్తారు. జీవితంలో కొత్త కొత్త మార్పులు చోటుచేసుకుంటాయి. సమాజంలో వీరు ఊహించనిరీతిలో పలుకుబడి పెరుగుతుంది. అన్నిచోట్లా గౌరవం ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. పెట్టుబడుల నుంచి వీరికి మంచి ఆర్జన లభిస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

మకర రాశి
కొన్నాళ్ల నుంచి వేధిస్తున్న మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. అంతేకాకుండా తీవ్రమైన ఆర్థిక లాభాలున్నాయి. గతంలో ఎన్నడూ కళ్లచూడని డబ్బును చూస్తారు. అదేస్థాయిలో సంపాదన ఉంటుంది. ఆదాయ ఆర్జనకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల జీవితంలో సంతోషకరమైన రోజులు ప్రవేశిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. వీరు ఏ పని తలపెట్టినా విజయం సాధించి తీరుతారు. ఉద్యోగస్థులకు వేతనాలు పెరగడంతోపాటు పదోన్నతులున్నాయి. వీరి ఆదాయం కూడా భారీగా పెరగనుంది.
సింహరాశి
కుటుంబంలో ఉన్న కలతలన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి. ఆనందం రెట్టింపు అవడంతోపాటు సంతోషంగా జీవిస్తారు. కొత్తగా ఆదాయ వనరులు లభిస్తాయి. అవకాశాలను ఉపయోగించుకొని లాభపడతారు. ఉద్యోగస్థులకు వేతనం భారీగా పెరగడంతో వీరికి రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.












Click it and Unblock the Notifications