ఈనెల 29 నుంచి ఈ రాశులపై కనక వర్షం కురిపించనున్న శుక్రుడు
నవగ్రహాల్లో కీలకమైనది, రాక్షసుల గురువైన శుక్రుడు ఈనెల 29వ తేదీన తన సొంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. సంపదకు, శ్రేయస్సుకు, లగ్జరీ జీవితానికి, ఐశ్వర్యానికి, అందానికి, ఫ్యాషన్స్ కు కారకుడైన శుక్రుడు తన సొంత రాశిలోకి వెళ్లడంవల్ల అన్ని రాశులపై ప్రభావం పడుతోంది. అయితే ప్రత్యేకంగా మూడు రాశులవారికి మాత్రం ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం.
కన్యా రాశి
ఈ రాశివారికి అనేక లాభాలు కలుగుతున్నాయి. మానసికంగా చాలా ప్రశాంతంగా జీవిస్తారు. అదృష్టం సహకరించి ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. అలాకాకుండా డబ్బు పరంగా, సమస్యల పరంగా అన్నీ పరిష్కారమవుతాయి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శుక్రుడికి ప్రత్యేక పూజలు జరిపిస్తే ఇంకా మేలు కలుగుతుంది. విద్యార్థులకు చాలా బాగుంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి కలుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకర రాశి
విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు కలగవు. సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. వ్యాపారాలు చేస్తున్నవారికి మంచి లాభాలున్నాయి. అంతేకాకుండా కొత్త వ్యాపారాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఉద్యోగస్థులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి.
వృషభ రాశి
ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది. అంతేకాకుండా గతంలోకంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. ప్రేమ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. వివాహ ప్రతిపాదనలు అందుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. వ్యాపారస్తులకు కొత్తగా ఆదాయ వనరులు తోడవుతాయి. కొంతకాలం నుంచి ఇబ్బంది పెడుతున్న ఆరోగ్యం కుదుటపడుతుంది.












Click it and Unblock the Notifications