18 ఏళ్ల తర్వాత కీలక పరిణామం.. ఈ నెల 30 నుంచి ఈ రాశులకు దరిద్రం!
నవగ్రహాల్లో కీలక గ్రహాలైన కేతువు, కుజుడు, శని 18 సంవత్సరాల తర్వాత ఒకే రాశిలో సంయోగం చెందుతున్నాయి. ఈనెల 30వ తేదీన సింహరాశిలో ఇటువంటి కీలకమైన పరిణామం చోటుచేసుకోబోతోంది. వచ్చే నెల 28వ తేదీ వరకు ఈ ప్రభావం ఉంటుంది. జాతకంలో ఇవి శుభస్థానంలో ఉంటే శుభ ఫలితాలు, అశుభ స్థానంలో ఉంటే అశుభ ఫలితాలు చోటుచేసుకుంటాయి. ఏయే రాశులు ఏవిధంగా వీటి ప్రభావానికి లోనవుతున్నారనే విషయాన్ని తెలుసుకుందాం.
సింహరాశి
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మనశ్శాంతి తగ్గిపోతుంది. మానసిక సమస్యలు పెరుగుతాయి. ఎదురయ్యే సమస్యలను గట్టిగా ఎదుర్కోవాలి. ఆర్థికంగా అనుకున్నరీతిలో ఉండదు. చెడువార్తలు వింటారు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు సాగడం మంచిది. ఆర్థిక విషయాలకు సంబంధించి పెద్దల సలహాలను తప్పనిసరిగా పాటించాలి.

కన్యారాశి
ఈ రాశివారు మనశ్శాంతిని కోల్పోయి మానసిక రోగాలు తెచ్చుకుంటారు. పనులపై దృష్టిసారించలేదు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఖర్చులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంటాయి. వీటిని మీరు భరించలేదు. అప్పులు చేయాల్సి వస్తుంది. వాటిని తిరిగి చెల్లించలేని పరిస్థితి ఎదురవుతుంది. ఆర్థిక విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అన్ని సమస్యలు దూరమవుతాయి.
మేషరాశి
ఈ సమయంలో వీరు అనేక సమస్యలను ఎదుర్కుంటారు. చిన్న విజయం సాధించాలన్నా చాలా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. జీవితంలో కీలక మార్పులు సంభవించబోతున్నాయి. విజయాలు సాధించలేకపోతే మరిన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. దురదృష్టం వల్ల ఏ సమస్య అయినా ఎదురవుతుంది. దానికి వెరవకూడదు. అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది.












Click it and Unblock the Notifications