శనిదేవుడి కేంద్ర త్రికోణ రాజయోగం... ఈ రాశుల నుదుటిరాత మారిపోతోంది

నవగ్రహాల్లో కీలక గ్రహం శని. ఆయన న్యాయదేవుడు. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడు. ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ నెల తొమ్మిదో తేదీన గ్రహాల రాకుమారుడు బుధుడితో కలిసి ఇదే రాశిలో కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. దీనివల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసివస్తోంది. శని, బుధుడు కలవడం వల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుంది? వారికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి? అందులో మీ రాశి ఉందా? లేదా? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

వృషభ రాశి
ఈ రాశివారికి ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. దీనివల్ల మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారు. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. వేతనం పెరుగుతుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. వృద్ధిలోకి రావడంతో కుటుంబ సభ్యులంతా సంతోషిస్తారు. పెద్దల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆందోళన అవసరంలేదు. విదేశాలకు వెళ్లాలనుకుంటున్న విద్యార్థులు కొంచెం ఎక్కువగానే కష్టపడాల్సి ఉంటుంది. ఇష్టదైవాన్ని పూజించడంతోపాటు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి.. గురువును పూజించాలి.

three zodiac signs will gain a good reputation in society and huge money due to kendra trikona rajayogam

కుంభ రాశి
డబ్బును భారీగా సంపాదిస్తారు. సంపాదించినదాన్ని మంచిగా పొదుపు చేస్తారు. రెండింటిలోను విజయం సాధించడంతో భవిష్యత్తులో మంచి రాబడి వస్తుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు మంచి స్థాయికి చేరుకుంటారు. చిన్నతనం నుంచి మీలో ఉన్న కోరికలన్నింటినీ నెరవేర్చుకుంటారు. పదిమందికి సాయం చేసే స్థితికి చేరుకుంటారు.

మకర రాశి
ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని అందుకుంటారు. మీ కష్టానికి తగినట్లుగానే భగవంతుడు కూడా రెట్టింపు ఫలితాలను అందజేస్తాడు. దీనివల్ల మీరు ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఆత్మవిశ్వాసంతో విజయాలను అందుకుంటారు. విద్యార్థులకు చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సంతోషం వెల్లివిరుస్తుంది. అందరూ కలిసి తీర్థక్షేత్రాల సందర్శనకు వెళతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+