మాలవ్య రాజయోగంతో ఈ రాశులకు 23వ తేదీ నుంచి అఖండ ధనయోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో సంపదకు, ఐశ్వర్యానికి, అందానికి, జీవితంలో వృద్ధికి కారకుడైన శుక్రుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రస్తుతం మీనరాశిలో ఉన్న శుక్రుడు అక్కడికి ఫిబ్రవరిలో ప్రవేశించాడు. దీనివల్ల మాలవ్య రాజయోగం ఏర్పడుతోంది. ఈనెల 14వ తేదీన హోలీ పర్వదినం అనంతరం 23వ తేదీన శుక్రుడు ఉదయిస్తాడు. మాలవ్య రాజయోగం ఉన్నవారు జీవితంలో విలాసవంతంగా ఉంటారు. వ్యక్తిత్వం బాగుంటుంది. సమాజంలో పేరు తెచ్చుకుంటారు. అమ్మాయిలు వీరిపట్ల ఆకర్షితులవుతారు. ఏయే రాశులపై ఈ యోగం ప్రభావం ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
ఈ రాశివారికి శుక్రుడు ధనంలో వృద్ధిని కలిగిస్తాడు. ప్రేమలో ఉన్నవారికి జీవితం చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇరువైపులా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఏ పని తలపెట్టాలన్నా దాంపత్య జీవితంలో ఉన్నవారికి జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. కలిసిమెలిసి ఉండటంవల్ల అనేక అడ్డంకులను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు. పెట్టుబడి పెట్టే విషయంలో సీనియర్ల నుంచి సలహా తీసుకోవాలి.

మకర రాశి
జాతకంలో శుభస్థానంలో ఉన్న శుక్రుడు విలాసవంతమైన జీవితాన్ని ఈ రాశివారికి అందిస్తాడు. లగ్జరీ జీవితాన్ని గడుపుతారు. జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తారు. గతంలో విజయం సాధించలేని నిరుద్యోగులు ఈ సమయంలో ఉద్యోగం సంపాదించి కుటుంబానికి ఆలంబనగా నిలుస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కంగారుపడాల్సిన అవసరంలేదు. డబ్బుపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు.
మిథున రాశి
భవిష్యత్తు చాలా బాగుంటుంది. జీవితంలో వీరికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూరుతాయి. అనుకోకుండా ధనం రావడంవల్ల జీవితంలో ఆర్థికంగా స్థిరపడతారు. డబ్బును పొదుపు చేసుకోవాలి. భవిష్యత్తులో రాబడి వచ్చేలా పెట్టుబడి పెట్టాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యులంతా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. మాలవ్య రాజయోగం ప్రభావం చాలా అరుదుగా వస్తుంటుంది. దాన్ని ఉపయోగించుకొని జీవితంలో వృద్ధిలోకి రావాలి. కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు వెళతారు.












Click it and Unblock the Notifications