అక్షయ తృతీయరోజు 4 యోగాలు.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే
అక్షయ తృతీయ లక్ష్మీదేవికి సంబంధించినది. ఆరోజు కొంచెమైనా బంగారం కొంటే కలిసివస్తుందనే నమ్మకం హిందువుల్లో ఉంది. వెండిని కూడా కొనుగోలు చేస్తారు. అదేరోజు కుబేరుడిని పూజించడంద్వారా శుభం జరుగుతుందని భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం అక్షయ తృతీయ రోజు అత్యంత మంగళకరమైన యోగాలు ఏర్పడుతున్నాయి. గజకేసరి రాజయోగం, మాలవ్య రాజయోగం, లక్ష్మీనారాయణ రాజయోగం, చతుర్గ్రాహి యోగం అన్ని రాశులను ప్రభావితం చేస్తున్నప్పటికీ మూడు రాశులపై మాత్రం ప్రత్యేక ప్రభావం ఉంటుంది. వారికి ఏది పట్టుకున్నా బంగారంలా కలిసివస్తుంది.
మీన రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. వీటిద్వారా అనేక విజయాలను అందుకుంటారు. ఇంటిని, వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఈ రాశివారిలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. జీవితంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తారు. ఒకరకంగా వీరు కోటీశ్వరులయ్యే కోటీశ్వర యోగం లభిస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

మిథున రాశి
అక్షయ తృతీయ నుంచి వీరికి అదృష్టం కలిసివస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. అలాగే ఉద్యోగం లేనివారికి ఉద్యోగం లభించడంతోపాటు ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థికంగా వీరి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. లక్ష్మీదేవి, కుబేరుడి ఆశీర్వాదం ఈ రాశివారికి పూర్తిగా లభిస్తుంది. ఒకరకంగా ధనవర్షం కురుస్తుందని చెప్పొచ్చు. జీవితంలో ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు.
వృషభ రాశి
ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. అందుకు అదృష్టం తోడుంటుంది. జీవితంలో ఇప్పటివరకు మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి పురోగతి ఉంది. పై అధికారుల నుంచి ప్రశంసలు లభించడంతోపాటు ఎంతో ప్రోత్సహిస్తారు. కొత్తగా ఇంటిని లేదంటే కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను తీసుకువస్తాయి. లక్ష్మీదేవి, కుబేరుడి ఆశీర్వాదాలు లభించడంవల్ల ఈ రాశివారికి తిరుగుండదు.












Click it and Unblock the Notifications