104 ఏళ్ల తర్వాత ఈనెల 18న పారిజాత యోగం.. ఈ రాశుల తలరాత మారుతోంది!
దీపావళి ఈనెల 20వ తేదీన ఉంటే.. అంతకు రెండు రోజుల ముందు 18వ తేదీన ధనత్రయోదశిని జరుపుకోబోతున్నాం. ఇదేరోజు అత్యంత అరుదైన పారిజాత యోగం ఏర్పడుతోంది. మనిషి జీవితంపై అధిక ప్రభావాన్ని చూపించే యోగాల్లో పారిజాత యోగం కూడా ఒకటి. దాదాపు 104 సంవత్సరాల తర్వాత ధన త్రయోదశి రోజు ఏర్పడనుండటంతో మూడు రాశులవారి జీవితాలపై అధిక ప్రభావం పడుతోంది. వారికి భారీ ధనార్జనతోపాటు ఊహించని లాభాలు పొందుతారు. ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం.
మీనరాశి
వీరికి లాటరీ తగిలే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారి కోరిక కూడా నెరవేరే సమయం ఇది. మంచి పెళ్లి సంబంధం కుదరడంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఆదాయం కూడా బాగా ఉంటుంది. రాజకీయాల్లో ఈ రాశివారు మంచిగా రాణించడానికి అవకాశం ఉంది. అన్నదమ్ములతో మంచి అనుబంధం ఉంటుంది.

వృశ్చిక రాశి
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడతారు. వాటినుంచి భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తారు. కొత్తగా ఇంటిని, వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మిత్రులతో, బంధువులతో ఆనందంగా ఉండటంతోపాటు వారి నుంచి సహకారాన్ని అందుకుంటారు. భూమికి సంబంధించిన లావాదేవీలు, వ్యవహారాల్లో శుభయోగాలున్నాయి.
సింహరాశి
వ్యాపారాల్లో ఊహించినరీతిలో లాభాలను కళ్లజూస్తారు. వచ్చిన డబ్బును ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు. కుటుంబం సంతోషంగా ఉంటుంది. గతంలో మొదలై పూర్తికాదు అనుకొని వదిలేసిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారు ఈ సమయంలో వెళతారు. న్యాయ సంబంధిత కోర్టు కేసుల్లో తీర్పు అనుకూలంగా వస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి.












Click it and Unblock the Notifications