8న మహాలక్ష్మీ రాజయోగం... ఈ రాశులపై బంగారు పూలవర్షం
మొత్తం ఉన్న నవగ్రహాల్లో ప్రతి గ్రహానికి ఒక సొంత రాశి ఉంటుంది. నిర్దిష్ట సమయంలో ఈ గ్రహాలన్నీ రాశి సంచారం చేస్తుంటాయి. ఒక రాశి నుంచి మరో రాశికి నిరంతరం మారుతుంటాయి. సూర్యుడు ప్రతి నెలకు తన రాశిని మారుస్తుంటే అత్యంత నెమ్మదిగా రాశిని మార్చేది శనిదేవుడు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని శని మారుస్తుంటాడు. వచ్చేనెల 8వ తేదీన చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదే రాశిలో కుజుడు సంచారం చేస్తున్నాడు. దీనివల్ల శక్తివంతమైన 'మహాలక్ష్మీ రాజయోగం' ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల కొన్ని రాశులకు విపరీతమైన మేలు కలగనుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.
మకర రాశి
ఈ రాశివారికి వారసత్వంగా తమ పూర్వీకుల నుంచి ఆస్తులను పొందుతారు. కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలున్నాయి. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది. గతంలో ఉన్న విభేదాలన్నీ మరిచిపోయి దాంపత్య జీవితంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు.

తులారాశి
ఆధ్యాత్మిక వాతావరణంపట్ల ఆసక్తి చూపుతారు. కొత్తగా ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవి మంచి ఫలితాలనిస్తాయి. అదృష్టం తోడుండి అన్ని పనులు విపరీతంగా చేయగులుగుతారు. కొత్తగా ఇంటిని కొనుగోలు చేయడం జరుగుతుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి.
కుంభరాశి
ఈ రాశివారికి ప్రస్తుత సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. వీరి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కెరీర్ కు సంబంధించి ఊహించినరీతిలో మార్పులు జరుగుతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాలతోపాటు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. రాదు అనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి.












Click it and Unblock the Notifications