2025లో ఈ రాశుల పంట పండింది... పట్టిందల్లా బంగారమే

నవగ్రహాల్లో అత్యంత కీలకమైనవి రాహువు, కేతువు. ఇవి ప్రతి 18 నెలలకు ఒకసారి తమ రాశులకు మార్చుకుంటుంటాయి. 2023లో రాశిని మార్చిన ఈ రెండు గ్రహాలు తిరిగి 2025లో మార్చుకోబోతున్నాయి. రాహువు మీన రాశి నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాయి. అన్ని గ్రహాల్లా ఇవి మాములుగా సంచరించవు. తిరోగమనదిశలో సంచరిస్తాయి. ఈ రెండు గ్రహాల సంచారం కొన్ని రాశులవారికి విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలను కల్పిస్తోంది. 2027 వరకు ఆ రాశుల్లోనే ఉంటాయి. అప్పటివరకు ఈ రాశులకు తిరుగులేదని చెప్పొచ్చు.

ధనుస్సు రాశి
ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. డబ్బును ఆదా చేసి భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగిస్తారు. పనిచేసేచోట కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాటిని అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.

three zodiac signs will get financial gains for two years due to rahu and ketu transits

మిథున రాశి
వీరికి రాహువు - కేతువు అన్నీ శుభ ఫలితాలనే కలిగిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నవారికి వేతనం పెరుగుదలతోపాటు ప్రమోషన్ ఉంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కాలం మీవైపు ఉందని చెప్పొచ్చు. ఏ పని తలపెట్టినా అదృష్టం తోడుంటుంది.

మకర రాశి
ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు చేసే అన్ని పనులకు సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. వారికి ఆదాయం పెరగనుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. వ్యాపారస్తులకు లాభార్జనతోపాటు వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఈ రాశివారు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని పొందుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+