శనిదేవుడి రాశిలోకి బృహస్పతి.. ఈ రాశుల పంట పండింది!
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. జ్యోతిష్యం ప్రకారం శనిదేవుడు న్యాయదేవత. ఆయన చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. నీతికి, నిజాయితీకి ప్రతిరూపంగా నిలిచేవారికి అండగా ఉంటాడు. నవంబరు నెలలో శని మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే నెలలో గురుడు కూడా తిరోగమనం చేస్తున్నాడు. దీనివల్ల మూడు రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
తులారాశి
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి భారీ లాభాలను అందుకుంటారు. డబ్బులు కూడా భారీ మొత్తంలో వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారస్తులకు మంచి ప్రయోజనాలు దక్కుతాయి. ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగులు తమ కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో కలిసి మెలిసి పనిచేస్తారు. దేవతలకు గురువైన బృహస్పతి సంచారం ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది.

కుంభరాశి
తాము చేసే పనుల్లో కొత్త బాధ్యతలు చేపడతారు. వ్యాపారంలో, వృత్తిలో ప్రత్యర్థులపై విజయాలు సాధిస్తారు. ఎన్నిరకాల సవాళ్లనైనా దీటుగా ఎదుర్కొంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. వ్యాపారస్తులకు మాత్రం మంచి ప్రయోజనాలు దక్కుతాయి. కుటుంబ సభ్యల మధ్య ఐకమత్యం పెరుగుతుంది. మంచి ఆలోచనలతో అందరూ కలిసి జీవితంలో ముందుకు పయనిస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభరాశి శనిదేవుడి సొంత రాశి.
మిథున రాశి
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను అందుకుంటారు. సమాజంలో గౌరవం పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. గతంలో పెట్టిన, ఇతరులకిచ్చిన డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. వ్యాపారస్తులకు మాత్రం ఊహించని రీతిలో లాభాలున్నాయి. ఆర్థికంగా అనేక లాభాలున్నాయి. ఉద్యోగాలతోపాటు వ్యాపారాల్లో ఉన్నవారు కూడా మంచి విజయాలను ఈ సమయంలో గురువు వల్ల నమోదు చేస్తారు.












Click it and Unblock the Notifications