మాలవ్య రాజయోగంతో ఈ రాశులకు అఖండ ధనయోగం

నవగ్రహాల్లో సంపదకు, ఐశ్వర్యానికి, విలాసవంతమైన జీవితానికి కారణమైన శుక్ర గ్రహం ఈనెల 29వ తేదీన వృషభరాశిలోకి ప్రవేశిస్తోంది. దీనివల్ల ఇతర గ్రహాలన్నీ శుక్రుడితో కలుస్తాయి. అప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా శక్తివంతమైన రాజయోగం. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులవారు విపరీతమైన అదృష్టాన్ని, సంపదను పొందుతారు. ఐశ్వర్యాన్ని, భౌతిక సుఖాలను అనుభవిస్తారు. ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం.

వృషభ రాశి
మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు ఈ సమయం బాగా కలిసివస్తోంది. వారికి భారీ లాభాలు రావడంతో ఆదాయం పెరుగుతుంది. సంపద వస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్నవారు భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. మాలవ్య రాజయోగంతో ఈ రాశులవారి జీవితాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. మంచి ఆరోగ్యం చేకూరుతుంది.

three zodiac signs will get good name in society and huge money due to malavya rajayogam

కన్యా రాశి
ఈ రాశివారి మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రశాంతంగా జీవిస్తారు. కెరీర్ పరంగా విజయాలను అందుకుంటారు. పెట్టుబడులు పెట్టి లాభాలను గడిస్తారు. ఆర్థికంగా గతంలోకంటే ఇప్పుడు బాగా మెరుగవుతారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. అలాగే ఒంటరిగా ఉంటున్నవారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ఉన్న భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉంటారు.

మీన రాశి
వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలు రచించి వాటిని అమలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడం వల్ల బాగా కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం రావడంతోపాటు ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. వాటితోపాటు పదోన్నతులు కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చిన డబ్బుతో స్థిరంగా మనసును ఉంచుకుంటారు. ప్రశాంతంగా జీవిస్తారు. అయితే దుబారా ఖర్చును ఈ రాశివారు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ప్రేమలో ఉన్నవారు ప్రేమ మాధుర్యాన్ని అనుభవిస్తారు. కొత్తగా ఇంటి నిర్మాణం చేపడతారు. సమాజంలో మంచి పేరు వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+