విజయ్ కోసం కుమారుడు సంచలన నిర్ణయం..!

తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. టీవీకే ప్రభుత్వం ఆధ్వర్యంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తమిళనాట తనదైన శైలిలో పరిపాలన సాగిస్తున్నారు. అయితే విజయ్ చివరి సినిమా జననాయగన్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూలై 24న విడుదల కానుంది. ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉన్నా సెన్సార్ బృందం ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అడ్డంకి చెప్పడంతో మూవీ రిలీజ్ నిలిచిపోయింది. ఎట్టకేలకు జననాయగన్ మూవీకి ఇటీవల సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దాంతో రిలీజ్ పై సందిగ్ధత వీడింది.

దాదాపు ఏడు నెలల తర్వాత మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే క్రమంలో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'సిగ్మా' మూవీ కూడా అదే సమయంలో రిలీజ్ కు సిద్ధమైంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది. విజయ్ 'జననాయగన్' కోసం సంజయ్‌ తన 'సిగ్మా' సినిమాను వాయిదా వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జననాయగన్ మూవీకి లైన్ క్లియర్ కావడంతో సిగ్మా చిత్రాన్ని ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసినట్లు స్పష్టం అవుతోంది. అయితే కరెక్ట్ తేదీపై త్వరలోనే క్లారిటీ రానుంది.

JasonSanjay postpones Sigma movie for Vijay s Jana Nayagan Son steps back for his father

ఇక సిగ్మా మూవీతో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్​ డైరెక్టర్ గా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా ఫరియా అబ్దాల్లా ఫీమేల్ లీడ్ లో నటించింది. అలాగే రాజు సుందరం, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్​ పై సుభాష్ కరణ్ ఈ మూవీని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. దాంతో విజయ్ జన నాయగన్ కోసం కుమారుడు జాసన్ సంజయ్ వెనక్కి తగ్గినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+