24 గంటల్లో రెండు గ్రహాల సంచారం.. ఈ రాశులకు కనీవినీ ఎరగని రీతిలో సంపద

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. అలాగే గ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడు ఈనెల 14వ తేదీన కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇదే రాశిలో 15వ తేదీన గ్రహాల రాకుమారుడు బుధుడు తిరోగమన దిశలో ఉంటాడు. బుధుడు తన గమనాన్ని మార్చడంవల్ల కొన్ని రాశులకు కలిసివస్తుంది. 24 గంటల వ్యవధిలోనే రెండు గ్రహాలు తమ స్థానాలను మార్చడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. మొత్తం 12 రాశులపై ప్రభావం ఉన్నప్పటికీ ప్రధానంగా మూడు రాశులపై అధిక ప్రభావం ఉండి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం.

సింహం రాశి
విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్నవారు విజయం సాధిస్తారు. సమాజంలో హోదా పెరిగి గౌరవాన్ని అందుకుంటారు. ఉద్యోగస్థులకు వారు ఊహించని రీతిలో విజయం పలకరిస్తుంది. వృత్తిలో మార్పు ఉంది. రుణ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. దాంపత్య జీవితంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలన్నీ తొలగిపోయి భార్యాభర్తలిద్దరూ సంతోషంగా జీవిస్తారు. వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది.

three zodiac signs will get huge benefits due to mercury and sun transit difference only 24 hours

తులా రాశి
ప్రేమలో ఉన్నవారి జీవితంలో అనేకరకాల మలుపులు చోటుచేసుకుంటాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వ్యాపారం చేసేవారికి అనేక మార్గాల నుంచి డబ్బు ప్రవాహం ఉంటుంది. ఉద్యోగస్థులకు ప్రమోషన్ ఉంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మొగ్గుచూపి కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి.

మేష రాశి
కొంతకాలంగా వేరేవారి దగ్గర నిలిచిపోయిన మీ డబ్బు చేతికి అందుతుంది. దీనివల్ల మనసు సంతోషంతో నిండిపోతుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఏ పని తలపెట్టినా ఆటంకం లేకుండా పూర్తవడంతోపాటు మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారు. వ్యక్తిగత జీవితంతోపాటు కెరీర్ పరంగా ఉన్న జీవితంలో కూడా మార్పులు జరుగుతాయి. జీవితంలో ఎదురవుతున్న అన్ని సమస్యలకు ఈ సమయంలోనే పరిష్కారం లభిస్తుంది. జీవితం సానుకూలంగా సాగుతుండటంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల మొగ్గుచూపుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+