500 ఏళ్ల తర్వాత మహా సంయోగం.. ఈ రాశులకు అద్భుత ధనయోగం
జ్యోతిష్యం ప్రకారం దాదాపు 500 సంవత్సరాల తర్వాత మహా సంయోగం ఏర్పడింది. ఈనెల 14వ తేదీన దేవతల గురువైన బృహస్పతి సంచారం చేశాడు. అలాగే కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇలా రెండు గ్రహాల మార్పులవల్ల మహా సంయోగం ఏర్పడిందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీనివల్ల అదృష్టానికి, ఐశ్వర్యానికి లోటులేదని చెబుతున్నారు. జాతకంలో ఈ రెండు గ్రహాలు శుభస్థానంలో ఉంటే వారి జీవితం తిరుగులేని విధంగా ఉంటుందంటున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి విజయాలున్నాయి. వారికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. కెరీర్ కు సంబంధించి ఈ రాశివారికి మంచి లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్థులకు వేతనాలు పెరిగి పదోన్నతలు లభిస్తాయి. ఆదాయ వనరులు దొరుకుతాయి. వాటితో వ్యాపారాలు ప్రారంభిస్తారు. వచ్చిన లాభాలను ఇతర వ్యాపారాల్లోకి పెట్టుబడులుగా పెడతారు. 500 సంవత్సరాల ఏర్పడిన ఈ యోగంవల్ల దాంపత్య జీవితం చాలా సజావుగా సాగుతుంది.

ధనస్సు రాశి
రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నవారికి అమ్మకాలు, కొనుగోళ్లు ద్వారా భారీ లాభాలను అందుకుంటారు. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు. ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అందరూ కలిసి విహార యాత్రలకు వెళతారు. భౌతిక సుఖాలను పొందుతారు. పెట్టుబడులు పెట్టడం అనేది వీరికి బాగా కలిసివస్తుంది. పెళ్లి కానివారికి వివాహం కుదురుతుంది. పెళ్లయినవారు అన్యోన్యంగా జీవిస్తారు. జీవిత భాగస్వామితో చెప్పి చేసే పనుల్లో విజయంతోపాటు ఆర్థిక లాభాలుంటాయి.
మిథున రాశి
కొత్తగా పనులు ప్రారంభించడంవల్ల మంచి విజయాలు సాధించి డబ్బులు కళ్ల చూస్తారు. కొన్ని పనులవల్ల భారీమొత్తంలో సంపద చేకూరుతుంది. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. సమాజంలో వీరికి హోదా పెరుగుతుంది. ఉద్యోగాలు మారాలనుకుంటున్నవారికి గొప్ప అవకాశాలు తలుపుతడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి పర్యటనలకు వెళతారు. వీరిపై సమాజంలో విశ్వాసం పెరుగుతుంది. డబ్బును పొదుపుచేసి భవిష్యత్తులో మంచి రాబడి పొందడానికి ప్రణాళికలు రచించుకుంటారు.












Click it and Unblock the Notifications