నడుచుకుంటూ వచ్చి ఈ రాశులపై కనక వర్షం కురిపిస్తున్న గ్రహాలు
సంపదకు, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు. అప్పటికే అక్కడ గ్రహాల రాకుమారుడు బుధుడు ఉన్నాడు. ప్రస్తుతం తిరోగమనం మొదలుపెట్టాడు. శని భగవానుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కాలానుగుణంగా ఈ మూడు గ్రహాల గమనం మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో బుధుడు, శుక్రుడు, శని ఎదురెదురుగా వచ్చాయి.
సంసప్తక రాజయోగం, కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఇవి ఏర్పరుస్తున్నాయి. రాశి చక్రాన్ని మార్చినప్పుడు లేదంటే నక్షత్ర రాశిని మార్చినప్పుడు అన్ని రాశులపై ప్రభావం పడుతున్నప్పటికీ ప్రత్యేకంగా కొన్ని రాశులవారిపై మాత్రం అధిక ప్రభావం ఉంటుంది. తాజాగా ఏర్పడిన యోగాలు కొన్ని రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింప చేస్తున్నాయి.

వృషభ రాశి
వ్యాపారస్తులకు ఇబ్బందులు తొలగిపోతాయి. బుధుడు, శని అనుగ్రహం వల్ల విద్యార్థులకు చదువు బాగా రావడంతోపాటు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఆర్థిక సమస్యలన్నీ క్రమేణా తొలగిపోతాయి. పిల్లలకు సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. డబ్బును పొదుపు చేస్తారు. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న వివాదాలన్నీ తొలగిపోతాయి.
వృశ్చిక రాశి
వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలు ముందుకు కదులుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని కేటాయిస్తారు. శనిదేవుడి అనుగ్రహం వల్ల గతంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు మొదలవుతాయి. ఈ సమయంలో చేసుకునే ఒప్పందాలు భవిష్యత్తులో లాభాలను తీసుకువస్తాయి.
సింహ రాశి
ఉద్యోగం చేస్తున్నచోట వస్తున్న కష్టాలు వాటంతటవే తొలగిపోతాయి. వ్యాపారస్తులకు ధనలాభం అధికంగా కనపడుతోంది. ఉద్యోగాల్లో ఉన్నవారు తమ పై యజమాని, ఇతర ఉద్యోగుల నుంచి మంచి మద్దతును సంపాదిస్తారు. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలపట్ల ఆసక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. వైవాహిక జీవితంలో ఉన్నవారి మధ్య అన్యోన్యత పెరుగుతుంది.












Click it and Unblock the Notifications