18 ఏళ్ల తర్వాత ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
నవగ్రహాల్లో కీలక గ్రహాలైన శుక్రుడు, కేతువు దాదాపు 18 సంవత్సరాల తర్వాత సింహరాశిలో కలుసుకోబోతున్నాయి. సంపదకు, అందానికి, విలాసవంతమైన జీవితానికి కారకుడు శుక్రుడు. కేతువు నీడ గ్రహం. ఈ ఇద్దరూ సంయోగం చెందడంవల్ల కొన్ని రాశిచక్ర గుర్తులకు అదృష్టం వరిస్తోంది. వృత్తిలో మంచి పురోగతితోపాటు ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అద్భుతమైన లాభాలను పొందుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
ఈ రాశులవారి అదృష్టం దివ్యంగా వెలిగిపోతుంది. దీనికి కారణం కేతువు, శుక్రుడు ఈ రాశిలోని తొమ్మిదో ఇంట్లో ఉంటారు. బ్యాంకులో డబ్బు నిల్వ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలతోపాటు ఇతర శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తిలో మంచి పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. అందరూ కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు.

సింహ రాశి
ఈ రాశివారి వ్యక్తిత్వం మెరుగుపడి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. హోదా పెరుగుతుంది. వ్యాపారవేత్తల ఆర్థిక పరిస్థితి బాగా బలపడుతుంది. పెళ్లయినవారు చాలా సంతోషంగా జీవిస్తారు. దాంపత్య జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు. ఉమ్మడిగా వ్యాపారం చేస్తున్నవారికి మంచి లాభాలున్నాయి. కలిసి మెలిసి ఉంటారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలను పొందుతారు.
వృశ్చిక రాశి
ఈ రాశికి సంబంధించిన పదో ఇంట్లో కేతువు, శుక్రుడి కలయిక జరుగుతుంది. వ్యాపారానికి సంబంధించి మంచి పురోగతి ఉంటుంది. లాభాలను ఆర్జిస్తారు. ఈ సమయం వీరికి బాగా కలిసివస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా జీవిస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారి కోరిక నెరవేరుతుంది. తండ్రితో అనుబంధం బలపడుతుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. తండ్రివైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది.












Click it and Unblock the Notifications