దీపావళికి ఆర్థికంగా కలిసిరావాలంటే వాస్తు ప్రకారం ఈ చిన్న పని చేయండి

వాస్తు అనేది ఈరోజు చాలా ప్రధానమైపోయింది. ప్రతి ముఖ్యమైన పనికి మంచి సమయాన్ని ఎలా చూస్తున్నామో వాస్తును కూడా అలాగే చూస్తున్నాం. ఇంట్లోకానీ, కార్యాలయంలోకానీ తిష్టవేసే ప్రతికూల శక్తులను వాస్తును సరిచేసుకోవడంద్వారా పారద్రోలవచ్చు. దీపావళికి ఆర్థికంగా బాగుండి కలిసిరావాలంటే ఈ ఒక్క పనిచేస్తే చాలని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. అదేమిటనేది తెలుసుకుందాం.

దీపావళి రోజు అందరూ లక్ష్మీ పూజ చేస్తారు. దీనికోసం ఇంటిని శుభ్రం చేస్తారు. పండగకు ముందే పూజా మందిరంలో విరిగిపోయిన దేవతామూర్తుల విగ్రహాలు, పటాలు ఉంటే వాటిని తీసివేసి నదిలో కలపాలి. చాలామంది వాటిని గుళ్లల్లో పడేసివస్తారు. నీళ్లల్లో కలిపితేనే చాలా మంచిది. గుళ్లల్లో అలా పడేయకూడదు.

To get financially well this Diwali do this small thing according to Vastu

ఇంట్లో పాడైపోయిన ఇనుప పాత్రలు, లోహాలు, వాటికి సంబంధించిన వస్తువులను తీసేయాలి. దీపావళికి ముందే వీటిని తీసేయడం ఉత్తమం. వీటి వల్ల శని, రాహువుల ప్రతికూల ప్రభావం పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకే నవగ్రహాలకు నిత్యం ప్రదక్షిణ చేస్తుండాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న పగిలిపోయిన గాజు పాత్రలు, వాటికి సంబంధించిన వస్తువులను తీసేయాలి. లేవంటే ఇవి ప్రతికూల శక్తిని ప్రసరిస్తాయి. దీపావళికి ముందే ఇంట్లో నుంచి వీటిని తీసేయాలి. అలా చేయకపోతే కుటుంబ సభ్యులపై దుష్ప్రభావాన్ని కలిగిస్తాయి.

చాలామంది తమ ఇళ్లల్లో పనిచేయని గడియారాలను ఉంచుకుంటారు. అలా ఉంచుకోవడం తప్పు. వాటిని వెంటనే తొలగించాలని చెబుతున్నారు. ఇవి ఉంటే ఇంట్లో అనేక సమస్యలకు కారణమవుతుందని తెలియజేస్తున్నారు పండితులు.

అలాగే ఇంట్లో పాడైపోయిన వస్తువులు చాలా ఉంటాయి. ఫర్నిచర్ కూడా దెబ్బతిని మూలన పడివుంటుంది. ఇవన్నీ ఇంట్లో సానుకూల శక్తిని దెబ్బతీస్తాయి. మనకు వచ్చే అదృష్టాన్ని, శ్రేయస్సును అడ్డుకుంటాయి. అందుకే వీటిని దీపావళి కంటే ముందే తీసేయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+