నేడే శక్తివంతమైన సూర్యగ్రహణం.. 12 రాశులవారు ఇలా చేస్తే సంపదలు!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంత అయితే ప్రాధాన్యత ఉంటుందో, గ్రహణాలకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. నేడు సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం చాలా ప్రత్యేకమైనది. గ్రహణ సమయంలో గ్రహ శక్తులు కూడా తీవ్రంగా ఉంటాయి, అవి మన జీవితం పైన సానుకూల ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.

రాశుల వారీగా నివారణలు
గ్రహణ ప్రభావాల నుంచి ఉపశమనం పొందడానికి రాశుల వారీగా నివారణలు చెప్పబడ్డాయి. ఈ పరిహారాలు మీ జాతకంలోని అశుభ ప్రభావాలను తగ్గించి శుభ ఫలితాలను ఇస్తాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఈ చర్యలను పాటించడం కచ్చితంగా ద్వాదశ రాశుల వారికి మేలు చేస్తుంది.

Today is a powerful solar eclipse If people of the 12 zodiac signs do this they will get rich

మేషరాశి, వృషభరాశివారికి నివారణలు
మేషరాశి జాతకులు సూర్య గ్రహణం పట్టిన సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మంచిది. అలాగే ఓం భాస్కరాయ నమః అంటూ సూర్యుడిని ప్రార్థిస్తే ఆ మంత్ర జపాన్ని చేస్తే మానసిక ప్రశాంతత, పనులలో విజయం లభిస్తాయి. వృషభ రాశి వారు గ్రహణం విడిచిన తర్వాత లక్ష్మీదేవిని పూజించి విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. దీనివల్ల వీరు సంపద పెరుగుతుంది.

మిధున, కర్కాటక, సింహరాశుల వారు ఇలా చెయ్యాలి
మిధున రాశి వారు శ్రీకృష్ణుని పూజించి, ఓం నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మంచి జరుగుతుంది.కర్కాటక రాశి వారు శివుడికి అభిషేకం చేసి, మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే మంచి జరుగుతుంది. సింహ రాశి వారు సూర్యభగవానుడిని ప్రార్థించి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే వీరి ఆత్మవిశ్వాసం, కీర్తి పెరుగుతాయి.

కన్యా, తులా రాశులవారు సూర్యగ్రహణం తర్వాత ఇలా చెయ్యాలి
కన్యా రాశి వారు గ్రహణం విడిచిన తర్వాత దుర్గా సప్తశతి పారాయణం చేసి దుర్గాదేవిని పూజిస్తే జీవితంలో విజయాలు వస్తాయి. తులా రాశి వారు శ్రీ సూక్తం పారాయణం చేసి, పూలతో లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల వీరికి వృత్తి, వ్యాపారాలలో మంచి జరుగుతుంది.

వృశ్చిక, ధనుస్సు రాశులవారికి ఇలా చేస్తే మంచి జరుగుతుంది
వృశ్చిక రాశి వారు హనుమంతుని పూజించి ఓం రామదూతాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. అంతా శుభమే జరుగుతుంది. ధనుస్సు రాశి వారు గాయత్రి మంత్రాన్ని జపించి విష్ణువుని పూజిస్తే మంచి జరుగుతుంది. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది.

మకర, మీన రాశుల వారికి దీంతో లబ్ది
మకర రాశి వారు శని దేవుని పూజించి ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే, శివలింగానికి బిల్వపత్రాలతో, నీళ్లతో అభిషేకం చేస్తే వారి జీవితంలో సానుకూలత, శాంతి వస్తుంది. మీన రాశి వారు విష్ణువుని ధ్యానం చేసి, ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే జీవితంలో సంతోషం ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+