ఈ రాశుల సుడి తిరిగింది... 2025లో వీరిపై శని ప్రభావం లేదు
ఖగోళంలోని నవగ్రహాల్లో కీలకమైన గ్రహం శనిదేవుడు. ఆయన న్యాయదేవత. చేసిన కర్మలనుబట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడానికి రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు. శనిదేవుడి మార్పు అన్ని రాశులపై పడుతుంది. ప్రస్తుతం కుభరాశిలో ఉన్న శనివల్ల ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. కొత్త సంవత్సరంలో శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశించగానే కర్కాటకం, వృశ్చిక రాశులకు అర్ధాష్టమ శని ప్రభావం తొలగిపోతుంది.
ఏలిననాటి ప్రభావం తగ్గిపోతుంది
కుంభరాశి, మీనరాశి, మకర రాశులవారికి ఏలిన నాటి శని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. వీరికి కూడా కొత్త సంవత్సరంలో వీటి నుంచి విముక్తి కలగబోతోంది. శనిదేవుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారడంవల్ల కొన్ని రాశులవారికి ఆర్థికంగా అనేక ప్రయోజనాలుంటాయి. కొత్త సంవత్సరంలో ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మద్దతు లభించి కార్యాలయాల్లో మంచిపేరు సంపాదించుకుంటారు. వేధిస్తున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మికంగా తీర్థయాత్రలకు వెళతారు. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది.

సమస్యలన్నీ తీరిపోతాయి
మార్చి 29న మీనరాశిలోకి ప్రవేశించే శనిదేవుడు 2027 జూన్ మూడోతేదీ వరకు అక్కడే ఉంటాడు. ఇలా రాశిని మార్చడంవల్ల ఏనలినాటి శనితోపాటు శనిధయ్య కలుగుతుంది. కొందరు వాటినుంచి బయటపడతారు. కర్కాటకం, వృశ్చిక రాశులకు అర్ధాష్టమ శని నుంచి బయటపడతారు. వీరి జీవితం ఎంతో సంతోషంతో నిండిపోతుంది. ఆగిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. లాభాలుంటాయి. అధికారుల జీవితం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు దరిచేరవు. పాత్ర మిత్రులను కలుసుకొని కొత్త స్నేహితులను పరిచయం చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారంలో కొత్తవాటిపై దృష్టి కేంద్రీకరిస్తారు.












Click it and Unblock the Notifications