ఇథనాల్ పెట్రోల్ తో గుండెపోటే..! బీజేపీకి రెడ్ సిగ్నల్ -దేశ ద్రోహిని కాదన్న నరేష్..!
ఇథనాల్ (Ethanol) కలిపిన పెట్రోల్ వాడకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వాహనదారుల పాలిట శాపంగా మారుతున్నాయి. దేశంలో పలు చోట్ల ఇప్పటికే ఇథనాల్ పెట్రోల్ వాడకం వల్ల తమ వాహనాల ఇంజన్లు పాడైపోతున్నాయని, మైలేజ్ కూడా రావడం లేదనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి. అయినా కేంద్రం మాత్రం ఇథనాల్ పెట్రోల్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గేందుకు సిద్దంగా లేదు. ఈ నేపథ్యంలో తెలుగు నటుడు, బీజేపీ మాజీ నేత నరేష్ (actor naresh) ఇథనాల్ కు వ్యతిరేకంగా గళం విప్పారు.
తాను దేశద్రోహిని కానని, కానీ ఈ ఇథనాల్ పెట్రోల్ బైక్ వాడేవారి నుండి ఖరీదైన కార్లు వాడేవారి వరకు గుండెపోటు తెప్పిస్తోందని నరేష్ తెలిపారు. ఇటీవల టయోటా కామ్రీ కొన్న తన స్నేహితుడు (బీజేపీ సానుభూతిపరుడు) ఇంజన్ వాల్వులు మార్చాల్సి వచ్చిందిని, దానికి అతనికి 3.5 లక్షలు ఖర్చయిందని తెలిపారు. అదే తన కొత్త పోర్షే పనామెరాకు జరిగితే, ఖర్చు సుమారు 12 లక్షలు అవుతుందన్నారు. అందుకే తాను లీటరుకు 165 రూపాయల ఖర్చుతో హై ఆక్టేన్ 100 పెట్రోల్‌కు మారాల్సి వచ్చిందన్నారు.

I am not anti national but this ethanol Petrol is giving heart attacks from bike users to high-end car users . My friend( a sympathiser of BJP) who bought Toyota Camry recently had to change valves of the engine. Which cost him 3.5 lks . If the same happens to my new Porsche… pic.twitter.com/4ciFCJxRv4
— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) July 19, 2026
ఇక బైక్ వాడేవారి సంగతేంటి, లేదా ఇతరుల సంగతేంటని ప్రశ్నించారు. ఇవి పీడకలల్లాంటివన్నారు. బీజేపీకి ప్లాన్ ఎ, బి & సి లతో కూడిన బలమైన మేధోమథన బృందం ఉందని, కానీ కోట్లాది మంది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి పర్యావరణాన్ని కాపాడాలనే ఈ నిర్ణయం ఖచ్చితంగా చాలా తొందరపాటుగా, తీవ్రంగా కనిపిస్తోందని ఓ మాజీ నాయకుడిగా చెప్తున్నట్లు నరేష్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలకు సుమారు రెండేళ్ల సమయం ఉండగా, గత ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తీరును బట్టి చూస్తే, ఇది బీజేపీకి ఒక రెడ్ సిగ్నల్ అని తేల్చేశారు. బ్రెజిల్ వంటి చిన్న దేశాలు కూడా ఇథనాల్‌ను దశలవారీగా విజయవంతంగా అమలు చేసి సఫలమయ్యాయని, ఎందుకంత తొందర? అంటూ వివిధ పెట్రోల్ వేరియంట్ల ధరలను తన ట్వీట్ లో పోస్టు చేశారు.


Click it and Unblock the Notifications