ఈ వార్త తెలిస్తే హైదరాబాదీలు సంతోషం పట్టలేరు.. హెచ్ఎండీఏ ఉత్తర్వులు !

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న నగరవాసులు, వాహనదారులకు తీపికబురు చెప్పింది హెచ్ఎండీఏ. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యను, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ లో మార్పులు ప్రధాన రహదారులను విస్తరించాలని నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో నగర రవాణా వ్యవస్థ మరింత సమర్ధవంతంగా మారనుంది.

హైదరాబాద్ నగరంలో రోడ్ల విస్తరణ పనులు

ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 30 మీటర్ల వెడల్పు ఉన్న నగర రహదారులు 60 మీటర్ల వరకు విస్తరించనున్నారు. హబ్సిగూడ మెట్రో స్టేషన్ నుండి ఉప్పల్ వరకు, ఎల్బీనగర్ జంక్షన్ మీదుగా నాగోల్ మూసి బ్రిడ్జి వరకు సుమారు 9. 21 కిలోమీటర్ల రోడ్డును ఈ విధంగా అభివృద్ధి చేయనున్నారు.

goodnews on hmda master plan hmda has issued a notification regarding changes to the master plan to widen major roads

ఈ మార్గాల్లో రోడ్ల విస్తరణ పనులు

ఐఎస్ సదన్ క్రాస్ రోడ్స్ నుండి ఆరాంఘర్ క్రాస్ రోడ్ మీదుగా గగన్ పహాడ్ వరకు సుమారు 7.38 కిలోమీటర్ల రహదారిని 60 మీటర్ల వెడల్పుకు పెంచనున్నారు. అలాగే నింబోలి అడ్డా, గోల్నాక, అంబర్ పేట ప్రాంతాల గుండా ఉప్పల్ రింగ్ రోడ్డు నుండి చాదర్ ఘాట్ జంక్షన్ వరకు 7.78 కిలోమీటర్ల రోడ్డు, ఎల్బీ నగర్ బస్టాప్ నుండి బైరమల్ గూడా ఫ్లైఓవర్ వరకు 4.21 కిలోమీటర్లకు విస్తరించనున్నారు.

అవసరాన్ని బట్టి వివిధ మార్గాల్లో రోడ్ల విస్తరణ

అలాగే కర్మన్ ఘాట్ నుండి చంపాపేట్ వరకు 1.57 కిలోమీటర్ల మేర రోడ్లను విస్తరించనున్నారు. సైబరాబాద్ ప్రాంతంలో మాదాపూర్ పిఎస్ మీదుగా హైటెక్ సిటీ జంక్షన్ నుండి మాదాపూర్ మెట్రో వరకు 2.58 కిలోమీటర్ల రోడ్డును, 36 మీటర్లకు విస్తరించనున్నారు. సికింద్రాబాద్, అల్వాల్ ప్రాంతాలలో ఎన్హెచ్ 44 నుంచి ఆల్వాల్ సర్కిల్ వరకు విస్తరించనున్నారు.

రోడ్ల విస్తరణకు రంగం సిద్ధం

నేరేడ్మెట్ క్రాస్ రోడ్స్ పరిధిలో 2.82 కిలోమీటర్ల రోడ్డును రోడ్ల విస్తరణకు 30 మీటర్లకు, ఈసీఐఎల్ నుండి రాధిక క్రాస్ రోడ్డు వరకు 45 మీటర్లకు, హిమాయత్ నగర్ సర్కిల్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు 30 మీటర్లకు రోడ్డు విస్తరణ చేయమన్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లోని జీవీకే మాల్ జంక్షన్ నుండి కెబిఆర్ పార్క్ వరకు రోడ్డును 24 మీటర్ల మేర విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు.

త్వరలోనే రోడ్ల విస్తరణ పనులు ప్రారంభం

ఈ రోడ్ల విస్తరణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఈ రోడ్ల విస్తరణ జరిగితే ట్రాఫిక్ జామ్ లు తగ్గి ప్రయాణ సమయం ఆదా అవుతుంది. వాహదారులకు కూడా కాస్త ట్రాఫిక్ నుండి ఉపశమనం కలుగుతుంది. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసే దిశగా ఈ చర్యలు మరో ముందడుగుగా కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+