ఒకే ఛార్జ్‌తో 450 కిలోమీటర్ల రేంజ్: ఇండియాలో లాంచ్ కానున్న హోండా ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్!
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. హోండా కూడా ఇప్పుడు భారత ఎలక్ట్రిక్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా హోండా దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది నాటికి కంపెనీ ఈ కారును మార్కెట్లోకి తీసుకువస్తుందని అంచనా భావిస్తున్నారు. భారత్‌లో తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో అంటే జనవరి, మార్చి మధ్య విడుదల చేయనున్నట్లు హోండా ధ్రువీకరించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇటీవల ప్రదర్శించిన హోండా 0 ఆల్ఫా కాన్సెప్ట్ ఆధారంగా ఉంటుంది. ఈ గ్లోబల్ ప్రాజెక్టులోభారత్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. హోండా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఫీచర్లను ఇప్పుడు చూద్దాం.
రూ.1200 కోట్ల పెట్టుబడి
ఇండియాలో ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తయారు చేయడానికి హోండా రూ.1200 కోట్ల భారీ పెట్టుబడిని పెడుతోంది. ఇండియాను కేవలం ఒక మార్కెట్‌గానే కాకుండా ఎగుమతి కేంద్రంగా కూడా పరిగణిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇండియాతో పాటు జపాన్, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయించనున్నారు.

కారు డిజైన్ ఎలా ఉంటుంది?
రోడ్ టెస్టింగ్ సమయంలో కనిపించిన కారును బట్టి దాని రూపం చాలా వరకు కాన్సెప్ట్ మోడల్ ను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఓ నివేదక ప్రకారం.. ఈ కారు పొడవుగా, నిటారుగా ఉంటుంది. దీనికి పెద్ద అద్దాలు ఉండవచ్చు. హోండా పూర్తి దృష్టి కారు లోపల ఎక్కువ స్థలం, సౌకర్యం కల్పించడంపైనే ఉంది.
బ్యాటరీ, రేంజ్
హోండా ఇంకా బ్యాటరీ, మోటార్ వివరాలను అధికారికంగా వెల్లడించనప్పటికీ, దీనిని రెండు బ్యాటరీ ఎంపికలతో అందించనున్నట్లు భావిస్తున్నారు.
ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఇది సుమారు 450 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని తెలిసింది. ఇది రోజువారీ నగర డ్రైవింగ్‌కు, హైవేపై సుదూర ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. భారతీయ రహదారులు, వాతావరణాన్ని తట్టుకునేలా దీనిని కఠినంగా పరీక్షిస్తున్నారు.
అత్యాధునిక ఫీచర్లు
ఇండియా హోండా ఇప్పటివరకు విక్రయించిన వాహనాల్లో ఈ ఎలక్ట్రిక్ కారు అత్యంత అధునాతనమైనది. ఇందులో కొత్త, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉంటాయి.
ఈ వాహనాలతో పోటీ
ఆలస్యంగా మార్కెట్లోకి రావడం వల్ల, హోండా ఇప్పటికే ఇండియాలో ఉన్న బలమైన పోటీదారులతో తలపడాల్సి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, మారుతి సుజుకి ఇ-విటారా, టాటా సియెర్రా ఈవీ, మహీంద్రా బీఈ 6 వంటి కార్లతో నేరుగా పోటీపడుతుంది. ఈవీ మార్కెట్లోకి ప్రవేశించడానికి హోండా కొంత సమయం తీసుకున్నప్పటికీ.. ఓ ఆల్ఫా ఆధారంగా రూపొందించిన ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ తన విభాగంలోని ఇతర వాహనాలకు గట్టి పోటీ ఇవ్వగలదు. కంపెనీ దీనిని సరైన ధరకు విడుదల చేస్తే, ఇది మార్కెట్లో హోండాకు ఓ గేమ్-ఛేంజర్‌గా నిరూపించుకోగలదు.












Click it and Unblock the Notifications