రుతుపవనాలు తిరిగొస్తున్నాయ్, మరో అల్పపీడనం - ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!!
వర్షాల కోసం వేచిచూస్తున్న వారికి వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అనువైన వాతావరణం ఏర్పడిన కారణంగా రుతుపవనాలు తిరిగి బలంగా పుంజుకోవడానికి సిద్ధమవుతున్నాయని తెలిపింది. ఈ నెల 23 లేదా 24 తేదీల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్‌కు ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. మారిన వాతావరణంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పైన కీలక అప్డేట్ ఇచ్చింది.
ఎన్‌నినో కారణంగా రుతుపవనాలు వచ్చినా.. వర్షాకాలం మొదలైనా వర్షాలు పడటం లేదు. ఇదే సమయంలో వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. రుతుపవనాల పునరుజ్జీవం ఈశాన్య భారతం లో మొదలై.. ఆ తర్వాత వచ్చే వారం ప్రారంభంలో తూర్పు, మధ్య, ఉత్తర భారత ప్రాంతాలకు విస్తరించనుందని ఐఎండీ అంచనా వేసింది. ఉరుములతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రస్తుతం ఉపరితల ద్రోణి కారణంగా రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాలలో పిడుగుపాట్లతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

మారుతున్న వాతావరణం
అదే విధంగా మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని హెచ్చరించారు. అదే విధంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. దీంతో, ఇప్పటికే వర్షాల కోసం వేచి చూస్తున్న వారికి ఈ వార్త ఉపశమనంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల వాతావరణం చల్లగానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications