ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాజయోగాను, కొన్ని శుభ ఫలితాలను కలిగిస్తాయి. నవగ్రహాల్లో కీలకమైన శనిదేవుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అలాగే రాహువు, కేతువు, కేజుడు, శుక్రుడు, సూర్యుడు, బుధుడు కూడా రాశుల్లో సంచరిస్తున్నారు.

ఈ ప్రభావం రాశిచక్ర గుర్తులపై ఏడాదిపాటు ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. కొన్ని రాశులకైతే మార్చి నెల నుంచే అద్భుతాలు జరగబోతున్నాయని, ఈ ఏడాది చివరి వరకు విపరీతమైన ప్రయోజనాలను అందుకోనున్నారని వెల్లడించారు. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

two zodiac signs will get all benefits from April to December 2025 due to planets transit

సింహరాశి
వీరు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. వ్యాపారాలు చేస్తున్నవారు తమ వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు విస్తరించడంతోపాటు కొత్త బాధ్యతలు చేపడతారు. కొత్తగా పెట్టుబడులు పెడతారు. దీనివల్ల ఆదాయ మార్గాలు దొరుకుతాయి. వచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. ఒకరకంగా ఈ సంవత్సరం వీరికి బాగా కలిసివస్తుందని చెప్పొచ్చు. ఉద్యోగస్థులకు పదోన్నతి లభించడమే కాకుండా కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు చేపడతారు. బృహస్పతి సింహరాశివారికి శుభస్థానంలో ఉండటంతో అన్నీ విజయాలే దక్కుతాయి. ఆర్థికపరమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేవారికి ఇది మంచి సమయం.

మేషరాశి
దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. అనేక శుభ ఫలితాలున్నాయి. సంపాదన బాగుంటుంది. అన్ని పనుల్లోను ప్రయోజనాలు సంపూర్ణంగా దక్కుతాయి. బృహస్పతి ఈ రాశివారికి సంపాదన స్థానంలో ఉండటంతో డబ్బుపరంగా వీరికి తిరుగులేదని చెప్పొచ్చు. సమస్యలను పరిష్కరించుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలు కెరీర్ ను కూడా ప్రభావితం చేస్తాయి. రాహువు, కేతువు మేషరాశివారికి శుభస్థానంలో ఉండటంతో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ వాటంతటవే తొలగిపోతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+